Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నుంచి తనకు ప్రాణ హాని ఉందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సామ దామోదర్ రెడ్డి అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సన్నిహి తులు, సతీమణి మహేశ్వరి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రమేష్‌తో కలిసి మాట్లాడారు. 2016లో కొంపల్లిలో తనకు భారీ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిస్తానని నమ్మించి శంకర్‌పల్లిలోని పలు సర్వే నెంబర్లు గల 113 ఎకరాల తన స్థలాన్ని మోసపూరితంగా అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నా డని ఆరోపించారు. దీంతోపాటు మరో 65 ఎకరాల స్థలాన్ని ప్రైవేటు గూండాలతో తన ఆధీనంలోకి తీసుకున్నా రని ఆరోపించారు. తన స్థలంలోకి ప్రవేశించకుండా ప్రవేట్ వ్యక్తులతో అడ్డు తగలడమే కాక మరోమారు వస్తే లారీలతో గుద్ది చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్న ట్టు తెలిపారు. అదే ప్రాంతంలోని తన తండ్రి పేరు పై ఉన్న ఫంక్షన్ హాల్‌ను సైతం కబ్జా చేశారని వాపోయారు. చివరకు ఆ ప్రాంతంలోని ఆలయాన్ని సైతం వదల్లేదన్నా రు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. దీంతో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్సీ కవిత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి వారి వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించగా జీవన్ రెడ్డికి వివాదాలు లేకుండా చూసుకోవాలని హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదని వివరించారు. సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి తనకు తన కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు.