Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశలను ప్రజల్లోకి తీసుకెళ్లేం దుకు దళిత రత్న అవార్డు పొందిన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ నాయకులు ఎమ్ ఎన్ శ్రీనివాసరావు సూచించారు. మహనీయుల జయంతి సందర్భంగా అవార్డు పొందిన అవార్డు గ్రహీతలకు బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం రాంనగర్లోని దావత్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ అభినంద న సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్ ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు నామకరణంతోపాటు 125 ఫీట్ల నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గొప్ప దళిత అభిమాని కేసీఆర్ అని పేర్కొన్నారు. దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం భూమిలేని వారికి ఇతర సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నా రు. ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్కు మద్దతు ఇవ్వాలని కోరారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ కో-చైర్మన్ జంగ శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు దళితులందరూ రుణపడి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జి.శంకర్, లోకేష్, రవీందర్, బాబురావు, చిన్న బాబురావు, హరినాథ్, శ్రీకాంత్, రాజు, లక్ష్మీపతి, బీఆర్ఎస్ నాయకులు బుజ్జి వెంకటేశ్వర్లు, నాగులు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.