Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో స్థానికుల ధర్నా
నవతెలంగాణ-జూబ్లిహిల్స్
బోరబండ డివిజన్లోని బాబా సైలనినగర్ బస్తీలో మంచినీటి కొరత తీవ్రంగా ఉందని, ఎక్కువ సమయం నీరు విడుదల చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక మహిళలు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు టి.సాయి శేషగిరిరావు మాట్లాడుతూ.. మంచినీళ్లు వదిలే సమయం పెంచాలని, మూడు రోజులకు ఒకసారి నీరు విడుదల చేస్తూ గంట మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ఎండాకాలం కాబట్టి బస్తీ ప్రజల అవసరాలుకు సరి పోవటం లేదని, ఎక్కువ సమయం నీరు విడుదల చేయా లని డిమాండ్ చేశారు. వారం రోజుల కిందట ఎస్సార్ నగర్ జీఎంకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చా మని, వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ సానుకూలంగా స్పం దించి ఆదేశాలు జారీ చేసినప్పటికీ అమలు కావడం లేద న్నారు. బస్తీల్లో మాత్రం ఎస్పీఆర్ హిల్స్ సెక్షన్ వాటర్ బోర్డ్ అధికారులు పాత విధానమే, అంటే గంటసేపు మాత్రమే మంచినీళ్లు వదులుతున్నారని తెలిపారు. అసలే రంజాన్ పండుగ సమయమని, నీటి అవసరం ఎక్కువగా ఉంటుం దని, అధికారులు వెంటనే స్పందించి నీటి విడుదల సమ యం పెంచాలని కోరారు. లేదంటే ఎస్సార్ నగర్ వాటర్ బోర్డు ఆఫీస్ వద్ద బస్తీల మహిళలతో కలిసి పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి, చంద్రకళ, సునీత, సుగుణమ్మ, గుండమ్మ, సరిత, అన్నపూర్ణ, నశ్రీన్ బేగం, విక్రా బేగం, నదియా బేగం, గ్లోరీ బారు, బుడిగ సుమతి, సికిందర్, అబ్రహం, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.