Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చైతన్యపురి
మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లోని ఎస్ఆర్కె పురం మెట్ల బావికి ఎంతో పురాతనమైన చరిత్ర ఉంది. 1966 లో ఏర్పాటుచేసిన ఈ మెట్ల బావి ద్వారా ఎన్నో కాలనీలలోని కుటుం బాలకు మంచినీరు అందేది. బావి నీటితో నిండిందంటే చుట్టు పక్కల కాలనీ వాసులకు పుష్కలంగా నీరు అందేది. కాలక్రమమైన కాలనీలు పెరగడం, భవనాలు ఏర్పాటు కావడంతో స్వతహాగా ఎవరింట్లో వాళ్ళు బోర్లు వేయించుకునేసరికి మెట్ల బావి నీరు ఊరడం తగ్గిపోయింది. దానికి తోడు నిర్వహణ లేకపోవడంతో శిధిలావస్థకు చేరుకుంది. దాదాపు రూ. 5 లక్షల వ్యయంతో 70 ఫీట్ల వెడల్పు, 60 ఫీట్ల లోతుతో ఏర్పాటు చేశారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో కూలిపోయే స్థితికి చేరుకుంది. కాలనీల జనాభా పెరగడం.. ప్రభుత్వం మంజీరా నీరు సరఫరా చేయడం తో మెట్ల బావి నుంచి వచ్చే నీటిని అవసరాలకు వినియోగిం చుకోవడం తగ్గించేశారు. బావి నిర్వహణ పట్టించుకోకపోవడంతో అందుబాటులోకి లేక చెత్తాచెదారం పోగయ్యింది. దీన్ని పునరు ద్ధరిస్తే కాలనీవాసులను బోర్లలో పుష్కలంగా నీరు ఉంటుందని స్థానికులు చెబుపుతున్నారు. ప్రస్తుతం వేసవికాలం బోర్లలో సరిపడా నీరు రావడం లేదు. ఆ బావి జలకళ సంతరించుకున్న సమయంలో 150 గజాల్లోపు బోర్ వేస్తే వేసవిలో కూడా నీరు పుష్కలంగా ఉండేదని కాలనీవాసులు తెలిపారు. పూడికతీత పను లకు నిధులు కేటాయిస్తే బావి జలకళను సంతరించు కుంటుంది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి పురా తన బావుల పునరుద్ధరణ కోసం నిధులు ఖర్చు చేసి వెలుగులోకి తీసుకొచ్చి అభివద్ధి చేసినట్టే ఎస్ఆర్కే పురం మెట్ల బావిని కూడా అభివద్ధి చేస్తారని కాలనీవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.