Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, ఎవరు ఆరోగ్యంగా ఉంటే వాడే ధనికుడని వనస్థలిపురం సీఐ జలంధర్ రెడ్డి అన్నారు. శనివారం జాగృతి అభ్యుదయ సంఘం, జీహెచ్ఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో 'ప్లాస్టిక్ బ్యాగులు వాడటం మానేద్దాం, పేపర్ కప్ లో టీ తాగడం దూరం చేద్దాం, మన పిల్లల భవిత వ్యాన్ని కాపాడదాం' అనే నినాదంతో శ్రీ గణేష్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి సీఐతో పాటు హయత్ నగర్ సర్కిల్ 3 డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ కరోనా సమయంలో అన్ని దేశాలు చేతు లెత్తేస్తే, భారతదేశం ప్రాచీన సంస్కతిక పద్ధతుల వల్ల తక్కువ శాతం మంది మరణించారని అన్నారు. ప్రతీ మని షికి క్యాన్సర్ రావడానికి కారణం తన జీవిత విధానమే కారణమన్నారు. దురాశకు పోకుండా ఆధునిక సౌకర్యాలు జోలికి పోకుండా మన సాంస్కతిక సాంప్రదాయాన్ని పాటించాలని గుర్తు చేశారు. దుకాణంలో పేపర్ కప్పులు, ప్లాస్టిక్ కప్పులు ఉపయోగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పూర్వకాలంలో కుండల్లో వంటలు చేయడం వల్ల ఆరోగ్య కరమైన భోజనం ఆ రోజుల్లో లభిం చిందని, అందు వలన ఆ కాలం మనుషులు ఎంతో ఆరోగ్య కరంగా ఉండేవాళ్ళు అన్నారు. అనంతరం డివిజన్ పరిధిలో ఉన్న చాయి దుకా ణం వాళ్లకు నరసింహారావు సహకా రంతో చాయి గ్లాస్ కప్పులను అందజేశారు. ఈ కార్యక్ర మంలో జాగతి అభ్యుదయ సంఘం చైర్మెన్ భావన శ్రీని వాస్, జైపాల్ రెడ్డి, రాము లతోపాటు పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు.