Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
వనస్థలిపురం డివిజన్ పరిధిలోని చింతలకుంటలోని జహం గీర్ నగర్ ఖైసర్, నవీద్ వారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసాన్ని పూర్తి చేసుకుని రంజాన్ పండుగను నిర్వహిస్తున్న ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ గుప్తా, లగ్గోని శ్రీధర్ గౌడ్, కొలిశెట్టి సంజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హస్తినాపురం : హస్తినాపురం డివిజన్ మైనార్టీల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చేరువ య్యేలా చూస్తానని స్ధానిక కార్పొరేటర్ బానోతు సుజాతా నాయక్ అన్నారు. నందనవనంలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో రంజాన్ సంధర్బంగా ఏర్పాటు చేసిన ఇప్తార్ విందులో వారు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛ నీయ ఘటనలు జరగకుండా సోదరభావంతో పండగను జరుపు కోవాలని, భవిష్యత్‌లో మసీదుల అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు జాకీర్ జావీద్ చాంద్ పాషా, ఆదిలక్ష్మి, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శశి ,అరుణ్, తదితరులు పాల్గొన్నారు.
నాగోల్ : నాగోల్ డివిజన్లో శనివారం రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఘనంగా పండుగ వేడుకలను జరిపారు. మజీద్‌లలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి బంధుమి త్రులను కలుసుకొని చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక అభివద్ధి సంస్థ మాజీ చైర్మెన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభా గం అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస గుప్త నాగోల్ డివిజన్లోని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చింతలకుంటలోని ముస్లిం మైనార్టీ సోదరుడు షేక్ మహమ్మదన్ు ఆయన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జగన్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సంతోష్‌నగర్ : ప్రజలందరూ రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మలక్ పేట నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీంలు భక్తిశ్రద్ధలతో నమాజ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిపి, సైదాబాద్ సిఐ సుబ్బిరామిరెడ్డి, చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్లో పనిచేసే తపల అయిన సిఐ సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశించినవిధంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరారు.
కర్ముగుడా డివిజన్లో...
ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకోవాలని యాకూత్‌పురా నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ ఫాషా ఖాద్రీ అన్నా రు. కర్ముగుడా డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఈద్గా వద్ద జరిగిన నమా జ్లో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఏడాది అన్ని పండుగలను సాంప్రదాయబద్దంగా కుల మతాలకు అతీతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.సౌత్ ఈస్ట్ జోన్ పీస్ కమిటీ ఆర్గనైజేషన్ సెక్రెటరీ గోవింద్ సాగర్, నవతెలంగాణ జర్నలిస్ట్ సింగ్, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఉప్పల్ : చిల్కానగర్ డివిజన్లో రూ. 52 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావం, సహాయం, దానగుణం, కష్టసుఖాలను పరస్పరం పంచుకునే సద్గుణాలను రంజాన్ మాసం నేర్పిందన్నారు. ముస్లిం మత పెద్దలు ఇమా ములు, మోజంలు, బీఆర్ఎస్ నాయకులు కొండల్ రెడ్డి, జహంగీర్, డివిజన్ మైనారిటీ అధ్యక్షులు అబ్బు బారు, మజీద్ ఏ నూర్ ఏ మదీనా, మజీద్ ఏ అక్సా అధ్యక్షులు, కార్యబృందం, హనీఫ్, యూ సుఫ్, అల్తాఫ్, షఫీ, తాహెర్, బిల్డర్ హనీఫ్, గౌస్, మహమూద్, కాసిం, ఇమామ్, మహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ : ఘట్కేసర్ మున్సిపాల్టీలో ఈద్గా దగ్గర మత పెద్దలను, ముస్లిం సోదరులను చైర్మెన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ పలువుల మాధవరెడ్డి కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జంగయ్య యాదవ్ మాట్లాడుతూ రంజాన్ అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థమన్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ సంపూర్ణంగా అవతరించిన మాసమే రంజాన్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బండారు ఆంజనేయులు గౌడ్ , బేతల నర్సింగ్ రావు , కో-ఆప్షన్ మెంబర్ షౌకత్ మియా , అధ్యక్షుడు కుతుబ్ , మజీద్ కమిటీ అధ్యక్షుడు అన్ను , నాయకులు, కయుమ్ , సలీం, జహంగీర్ , అజీమ్ , ఆయుబ్ , కాళీళ్ , జహంగీర్ , అస్లాం, ఫాయుమ్ తదితరులు పాల్గొన్నారు..
పోచారం : పోచారం మున్సిపల్ పరిధిలోని నరపల్లిలో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పోచారం మున్సిపల్ అధ్యక్షులు మందడి సురేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శేఖర్, కౌన్సిలర్ సుర్వి రవీందర్, కో ఆప్షన్ సభ్యు లు అక్రమ్ అలి, నాయకులు బద్దం జగన్మోహన్ రెడ్డి, మోటుపల్లి శ్రీనివాస్, సయ్యద్ సాదిక్, యూసఫ్, సర్దార్‌పాషా, నాసిర్‌ఖాన్, తాహిర్, అజమ్, జిలానీ, ప్రవీణ్‌గౌడ్, ఉపేందర్, రామారావు, పంగ అయోధ్య, కొమ్మరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు