Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఎల్బీనగర్
సరూర్ నగర్ డివిజన్ అభివృద్ధి కోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిధులు మంజూరు చేయాలని కార్పోరేటర్ శ్రీవాణి అంజన్ కుమార్ డిమాండ్ చేశారు. నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంత్రికి కార్పొరేటర్ లేఖ రాశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా డివిజన్లో ఉన్న సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు, మంత్రికి వినతి పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. కానీ గుత్తేదారులకు సకాలములో ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో పనులు నత్త నడకన నడుస్తున్నాయన్నారు. సంవత్సరాల నుంచి డివిజన్ ప్రజల సమస్యలు మీకు తెలియదా అని మంత్రి ని ప్రశ్నించారు. జూనియర్ కళాశా లలో టాయిలెట్ల దుస్థితి సరూర్నగర్ ప్రజలకు తెలుసు అని.. ఒకే గదిలో ఐదు తరగతులకి పాఠాలు చెబుతు న్నార ని పేర్కొన్నారు. వసతులు లేని బీ.సి. హాస్టల్, వి.యం. హౌమ్ కు వసతులు ఎప్పుడు కల్పిస్తారని ప్రశ్నించారు.
భగత్ సింగ్ నగర్, క్రాంతినగర్ కష్ణానగర్, లక్ష్మీనగర్, వెంకటేశ్వర కాలనీ, బాపునగర్ చౌడి, హుడా కాంప్లెక్స్, ఇంద్రా హిల్స్, చెరుకుతోట కాలనీ, పోచమ్మబాగ్, వెంక టేశ్వర కాలనీ, విజయపురి కాలనీ, ఎస్.బి.ఐ కాలనీలో కొత్త యు.జి.డి. పైప్ లైన్ కొరకు 15 కోట్లు. భగత్ సింగ్ నగర్, అంబేద్కర్ నగర్, కష్ణానగర్, బాపూనగర్, చెరుకుతోట కాలనీ, పోచమ్మబాగ్, జేబి కాలనీ, ఇంద్రాహిల్స్, క్రాంతి నగర్, వికాస నగర్, శ్రీనివాసకాలనీ, కల్కినగర్ లో కొత్త సి.సి రోడ్ల కోసం రూ. 10 కోట్లు మంజూరు చేయాలని కార్పొరేటర్ కోరారు. విజయపురి కాలనీ, హుడాకాలనీ, డాక్టర్స్ కాలనీ, ఎస్.బి.ఐ కాలనీ, లక్ష్మీనగర్, వెంకటేశ్వర కాలనీలో బి.టి రోడ్ల కోసం 10 కోట్లు మంజూరు చేయాలన్నారు.ఇండోర్ స్టేడియం నుండి జె.బి. కాలనీ, డాక్టర్స్ కాలనీ, శంకర్ నగర్ లోని వర్షపు నీటి నాలా నిర్వహణ కొరకై రూ. 5 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. భగత్ సింగ్ నగర్ ఫేస్ 1,2లో ప్రభుత్వ పాఠశాల నిర్మాణం, డివిజన్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వస తులు కల్పించడం, కేజి టు పీజీ కాలేజీ, ఇండోర్ స్టేడియం మరమ్మతులు, డివిజన్ ప్రజల కోసం వాకింగ్ ట్రాక్, సరూర్ నగర్ చెరువుకు సంబంధించి మెరుగైన పర్యవేక్షణ అలాగే భగత్ సింగ్ నగర్, అంబేద్కర్ నగర్ స్మశాన వాటి కల అభివృద్ధి, నిర్వహణకు నిధులు కేటాయించాలన్నారు.
లక్ష్మీనగర్, వికాస్ నగర్, హుడా కాలనీ, భగత్ సింగ్ నగర్, ఎస్.బి.ఐ కాలనీ, శంకర్ నగర్, కష్ణానగర్ కాలనీ, జే.బి.కాలనీలో కమ్యూనిటీ హాల్స్, మహిళా భవన్ కోసం నిధులను మంజూరు చేయాలన్నారు. అలాగే పలు కాలనీ లలో సి.సి కెమెరాలు ఏర్పాటు కోసం నిధులు ఇవ్వాలని కోరారు. వీధి దీపాల మరమ్మత్తుల కోసం యంత్రాలను ఏర్పాటు చేయాలి కోరారు. పారిశుధ్య కార్మికుల సంఖ్య ను పెంచాలన్నారు. సరూర్ నగర్ డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.