Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ (ఎం-ఎల్) ప్రజాపంథా రాష్ట్ర నాయకురాలు కె.రమ
నవతెలంగాణ-అడిక్మెట్
విప్లవ సారథి, నూతన సమాజ మార్గదర్శి కామ్రేడ్ లెనిన్ అని సీపీఐ (ఎం-ఎల్) ప్రజాపంథా రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కె. రమ అన్నారు. శనివారం లెనిన్ 153వ జయంతి సందర్భంగా విద్యానగర్ మార్క్స్ భవన్ ముందు జెండా ఆవిష్కరణ చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కే రమ మాట్లాడుతూ. దేశంలో పార్ల మెంటరీ పంథా తిరస్కరించి, విప్లవోద్యమం నిర్మాణం చేపట్టిన దినంగా లెనిన్ జయంతి జరుపుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎన్ని కల ద్వారానే వ్యవస్థలో మార్పు రాదని లెనిన్ భావించారని,. అందులో భాగంగానే నక్సల్ బరి, శ్రీకాకుళం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందన్నారు. దేశంలో మార్పులను పరిశీలించి, కార్మిక వర్గం పెరిగిన తీరును పరిగణలోకి తీసుకుని కొత్త పంథాతో పోరాడుతున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్ర మంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా సెక్రటేరియట్ సభ్యులు కె. సూర్యం, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ఎం. హన్నేష్, నాయకులు ఎస్.ఎల్ పద్మ, వి. ప్రవీణ్, వి. కిరణ్, ప్రదీప్, ఎస్. నాగేశ్వర రావు, రవి కుమార్, వరలక్ష్మి, లక్ష్మిబాయి, స్వాతి, ప్రవీణ్, పుష్ప, శ్యామల, కష్ణ, విజయలక్ష్మి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.