Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
నిమ్స్ ఆసుపత్రిలో అక్రమాలకు పాల్పడుతున్న అడ్మిని స్ట్రేషన్ డాక్టర్ కేవీ కృష్ణారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయా లని బీసీ నాయకుల డిమాండ్ పై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు స్పందించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగో పాల్ తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిమ్స్ ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేషన్ అడిషనల్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న కేవీ కృష్ణారెడ్డి రోగులకు మెరుగైన, వైద్య సదుపాయాలు కల్పిస్తానని వారి వద్ద డబ్బులు దండుకుని ఎలాంటి వైద్యం చేయకుండా. పేషెం ట్లను తిరిగి పంపిస్తున్నారని ఆరోపిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు వినతి పత్రం అందించారు. మంత్రి స్పందించి మెడికల్ కౌన్సిల్ చైర్మన్ వి.రామలింగం కు ప్రత్యేక లేఖ ద్వారా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు.