Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు బీసీ అడ్వకేట్ అసోసియేషన్ కన్వీనర్ విజయ ప్రశాంత్
నవతెలంగాణ-అడిక్మెట్
హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియమకాలలో బిసి/ ఎస్సి/ఎస్టిలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ కోటా ప్రవేశ పెట్టాలని, బిసి అడ్వకేట్కు నెలకు 20 వేల స్టైఫండ్ మంజూరు చేయాలని హైకోర్టు బీసీ అడ్వకేట్ అసోసియే షన్ కన్వీనర్ విజరు ప్రశాంత్. డిమాండ్ చేశారు.ఈ మేరకు శనివారం విద్యానగర్ బీసీ భవన్ లో హైకోర్టు బిసి అడ్వకేట్స్ కోర్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య, విజయ ప్రశాంత్ హాజరై మాట్లాడా రు. ప్రతి అడ్వకేట్కు 250 గజాల ప్రభుత్వ స్థలం, ఇళ్ళ పట్టాలు మంజూరు చేయాలని కోరారు. సామాజిక న్యాయసాధన కోసం బీసీ న్యాయవాదులు ఈనెల 30న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాగుల శ్రీనివాస్ యాదవ్, బత్తుల కృష్ణ, రేపాకుల నాగేశ్వరరావు, జక్కల వంశీకృష్ణ, రాఘవేంద్ర, సత్యనారాయణ, సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.