Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్‌నగర్
రంజాన్ పండుగ వేడుకలు శనివారం ముస్లిం సోదరులు, సోదరీమణులు ఘనంగా జరుపుకున్నారు.క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, మానవత్వంతో కూడిన పరమత సహనం, మతసామ రస్యాన్ని పాటించాలని మత పెద్ద గురువులైన ఇమామ్‌లు సామూ హిక ప్రార్థనల్లో కోరారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాప్రా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో గల అన్ని ఈద్గాలలో ముస్లింలు పెద్దసంఖ్యలో హాజరై సామూహిక ప్రార్థనలు జరిపారు. జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, కమిటీ సభ్యులు ఎం.డి.పాషామియా, టి.కాలేశా, గౌస్, వహీద్, మహ్మద్ యూసూఫ్ ఖాద్రీ, సైయద్, జావేద్, ఉమార్ తదితరులు ఉన్నారు.
జవహర్‌నగర్‌లోని 28వ డివిజన్లో ముస్లిం ప్రజలందరికి మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, 28వ డివిజన్ అధ్యక్షుడు బూడిద వెంకటేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ యూసుఫ్, కుద్రి, రియాజ్, ఫిరోజ్, అబ్దుల్ ఖాదర్, మోసిన్, సలిమ్ షా, మోహిద్ నహీద్, ఫిరోజ్, అక్తర్, షరీఫ్, మౌలానా ఇమనుద్దీన్, సయ్యడ్ అబ్బు తదితరులు పాల్గొన్నారు.
నాచారం : మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ముస్లిం సోదరీ సోదరులకు, మత పెద్దలకు మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి రంజాన్ పండగ శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంటి కష్ణ, పి ఆర్ ప్రవీణ్, ఎండీ అల్తాఫ్, ఫిరోజ్ ఖాన్, మసూద్, రహమాన్, మెయిన్ పాషా బారు, బాసిత్, రఘు, శ్రావణ్ రెడ్డి, మున్నాన్, మోహసిన్ పాల్గొన్నారు.
నాచారం డివిజన్ పరిధిలోని ఎర్రకుంట ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ పాల్గొని ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలి పారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సాయిజెన్ శేఖర్, నాయకులు కట్టబుచ్చి గౌడ్, చంద్రశేఖర్, ఖాదర్, తదితరులు పాల్గొన్నారు.
కాప్రా : రంజాన్ వేడుకల్లో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి దంపతులు పాల్గొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు పాలుపంచుకుని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం మత పెద్దలు మహబూబ్ మైనారిటీ నాయకులు రియాజ్, ఏజాజ్ల గహాలకు వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నిరుపేద కుటుంబానికి చెందిన చర్లపల్లి వాసి రెహమాన్ ఐజి కాలనీకి చెందిన నజీర్ కుటుంబ సభ్యుల ఇండ్లల్లో రంజాన్ వేడుకల్లో పాల్గొని వారిలో సంతోషం నింపారు. ఈసీఐఎల్ చౌరస్తాలోని ప్రధాన ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో బొంతు దంపతులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఎన్నార్ గ్యాస్ అధినేత రియాజ్ , కమల నగర్ కు చెందిన ఆజీక్ అలీ ఖురేషి ఇచ్చిన రంజాన్ తేనేటివి విందుకు హాజరై వారికిపండుగ శుభాకాంక్షలు తెలియపరిచారు. వారితో పాటుగా కాపుర కార్పొరేటర్ స్వర్ణరాజ్ ,మాజీ కార్పొరేటర్ గొల్లూర్ అంజయ్య కూడా ఉన్నారు.
కాప్రా మసీద్ వద్ద బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థా పకులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి నమాజ్‌లో పాల్గొన్నారు.. ఉప్పల్ నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీ మణులకు వారు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్ పండు గ క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అందరిలో పెంపొందిస్తుం దన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కులమతాలకు అతీతంగా పరిపాలన సాగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. మైనార్టీ సెల్ ఉప్పల్ నియోజకవర్గ ప్రెసిడెంట్ బద్రుద్దిన్, సర్కిల్ ప్రేసిండెట్ బాషా ,రహీం, బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు బైరి నవీన్ గౌడ్, ఇంద్రయ్య ,నేమూరి మహేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డిలు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. హెచ్‌బీ కాలని మసీదును సందర్శిం చిన కార్పొరేటర్ ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం ప్రభుదాస్ మాట్లా డుతూ మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ అని, సామరస్యానికి, సహద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, ద్రాతత్వానికి ప్రతీక అని అన్నారు. స్థానిక నాయకులు శేఖర్ గౌడ్, నవీన్ గౌడ్, జంపాల్ రెడ్డి, కుమార్, దండెం నరేందర్, మనీష్ తదితరులు పాల్గొన్నారు.
నేరేడ్మెట్ : అల్వాల్ సర్కిల్ పరిధిలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈద్గాలు, మసీదు లు కిటకిటలాడాయి. ముస్లింలు ఈద్గా , మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వెంకటాపురం అంబేద్కర్ నగర్ల్యోద్ మోసిన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద మొత్తంలో ముస్లిం సోదరులు హాజరై ప్రార్థన చేశారు. ఆయన మాట్లాడుతూ..రంజాన్ ముస్లిం లకు ఎంతో ముఖ్య మైనదన్నారు. ఈర్ష్య ద్వేషం అసూయ మంచి చెడు, కులం మతం అతీతంగా అభిమానంతో ఉండటమే రంజాన్ విశిష్ట త అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రార్ధనా స్ధలాల వద్ద గట్టి పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు
కంటోన్మెంట్ : న్యూ బోయినపల్లి పెన్షన్ లైన్ ఈద్గాలో ముస్లీంలు సామూహిక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, బోయినపల్లి సీఐ రవికుమార్, తిరుమలగిరి ట్రాఫిక్ సీఐ పురుషోత్తం రావు, ముస్లీంలను ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద ర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ పండుగ ఏ మతానికి సంబంధించినదైనా సరే ఒక సందేశం ఉంటుందని.. మానవాళికి హితాన్ని బోధిస్తుందని అన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రమదాన్ పండుగ మత సామరస్యతను తెలియ జేస్తోందని అన్నారు. సీఐ రవికుమార్,. పురుషోత్తం రావు, షాకిబ్, సిరాజ్, రిజ్వాన్, మౌలా ఆజామ్, మున్నా, సులేమాన్, మహేందర్, వర ప్రసాద్, పవన్ తదితరులు పాల్గొన్నారు.