Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్‌నగర్
సీఎం సహాయ నిధి పేద ప్రజల వైద్యానికి భరోసా అని, సీఎం కేసీఆర్ పేద ప్రజల ఆరోగ్య రక్షణ కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కార్పొరేటర్ జమాల్పూర్ నవీన్ కుమార్ అన్నారు. కార్పొరేషన్‌లోని 25వ డివిజన్‌కు చెందిన చిన్నారి స్నేహ దవాఖానాలో చికిత్స పొందుతున్నది. వైద్య సహాయం నిమిత్తం కార్పొరేటర్ దృష్టికి వెళ్లగా సీఎం సహా యనిధికి దరఖాస్తు చేయించారు. వెంటనే స్పందిచిన మంత్రి మల్లారెడ్డి సీఎం సహాయనిధి నుంచి రూ. 1లక్ష ఎల్ఓసీని బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలు వైద్యం కోసం ప్రయివేటు దవాఖానాలకు వెళ్లి ఆర్ధికంగా ఇబ్బం దులు పడేవారని, రాష్ట్రంలో రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొ న్నారు. చికిత్స పొందుతున్న చిన్నారి వైద్యానికి ఎల్ఓసీ అందజేసినందుకు మంత్రి మల్లారెడ్డి, కార్పొరేటర్ నవీన్ కుమార్‌కు బాధిత కుటుంబసభ్యులు ధన్యవాదములు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.