Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం మైనారిటీ సోదరులకు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న నూతన వస్త్రాలను బీఆర్ఎస్ నాయకుడు నందికొండ శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. శనివారం నాచారం పెద్ద మసీదులో ముస్లిం మైనారిటీ సోదరులకు రంజాన్ తోఫా అందజేసి ఈద్ ముబారక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు మింద్రాల స్వామి, బీసీ సంఘం నాయకుడు బద్దాని సదానందం, కనుకుంట్ల విజయ, ముస్లిం మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంటు ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డిని రాష్ట్ర ఆటో మోటార్ రవాణా సంఘం రాష్ట్ర అధ్య క్షులు వేముల మారయ్య ఆధ్వర్యంలో మైనారిటీ సోదరుడు సర్వర్తో కలిసి రంజాన్ ముబారక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వ మతాల సమ్మేళనం తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం ఎల్లవేళలా కషి చేస్తానని అన్నారు. ఆటో రవాణా రంగ కార్మికుల పక్షపాతిగా ఉంటూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తున్న ఆటో రవాణా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య కు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు ఆటో రంగంలో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.నాయకులు నారాయణ, శ్రీనివాస్, రమణారెడ్డి, రమేష్, సాయి, తదితరులు పాల్గొన్నారు.