Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు ల్యాప్ టాప్‌లు, రెండు సెల్ఫోన్లు,
- రూ.5 లక్షల నగదు స్వాధీనం
- నలుగురు నిందితుల రిమాండ్
- వివరాలు వెల్లడించిన డీసీపీ శ్రీనివాసరావు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
చెవిటి, మూగ, గుడ్డివారిలా నటిస్తూ రెక్కి నిర్వహిస్తూ చోరీల కు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర ముఠా చోరీ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం సాయంత్రం షాపూర్‌నగర్‌లోని బాలనగర్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా పట్టణ ప్రాంతానికి చెందిన వడివేలు, మరియప్పన్, సత్తి వేలు, సత్యరాజ్ కూలీ పనులు, చిన్నచితికా ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈజీ మని సంపాదించాలనే వక్ర బుద్ధితో చోరీలు చేయాలని టార్గెట్‌ను ఎంచుకున్నారు. కొన్నేండ్ల క్రితం నగరంలోని బీహెచ్ఈఎల్ సమీపంలోని పఠాన్ చెరువు ప్రాంతంలో రూంను అద్దెకి తీసుకుని నివసిస్తున్నారు. వీరు పలు ప్రధాన పట్టణ ప్రాంతాల్లో రద్దీ ఉండే నగరాలను ఎంచుకుని చోరీలకు పక్కా ప్లాన్ వేసుకుంటారు. వీరిపై గచ్చిబౌలి, మియాపూర్, మాదా పూర్, కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, సనత్‌నగర్, ఆర్జీఐ, నార్సింగి, రాయదుర్గం, జీడిమెట్ల, చందానగర్, బాచుపల్లి, కొత్తూరు, మైలా ర్దేవ్పల్లి, రాజేంద్రనగర్, ఆర్సీపురం, శంకర్పల్లి పోలీస్ స్టేషన ్లలో సుమారుగా 105 చోరీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. రెండు రోజుల క్రితం కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం తెలుసుకున్న సీసీఎస్ పోలీసులు నలుగురు నిందితులను వల పన్ని చాకచక్యంగా పట్టుకుని అదుపులోకి తీసుకుని విచారించా రు. నిందితులు చేసిన నేరాలు ఒప్పుకున్నారనీ, వీరి వద్ద నుంచి మూడు ల్యాప్ టాప్‌లు, రెండు సెల్ ఫోన్లు, రూ.5 లక్షల నగదను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీసీఎస్ పోలీసులను డీసీపీ అభినందించారు. సమావే శంలో కూకట్పల్లి ఏసీపీ, మాదాపూర్ ఏసీపీతోపాటు కేపీహెచ్‌బీ సీఐ కిషన్ కుమార్, ఎస్సైలు, సీసీిఎస్ పోలీసులు పాల్గొన్నారు.