Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిరాయి హంతకులతో కలిసి పన్నాగం
- రిటైర్డ్ సీఐతోపాటు మరో ఇద్దరి అరెస్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో
పాతకక్షలు మనస్సులో పెట్టుకుని ఓ రియాల్టర్ను హత్యచేసేందుకు కిరాయి హంతకులతో కలిసి కుట్రచేసిన రిటైర్డ్ సీతోపాటు మరో ఇద్దరిని నార్త్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కంట్రీమేడ్ పిస్తోల్, మారుణాయుధాలతోపాటు రూ.1లక్ష నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌లోని సీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీలు జోయేల్ డేవీస్, రాధాకిషన్ రావులతో కలిసి సీపీ సీవీ ఆనంద్ వివరాలను వెళ్లడించారు. కరీంనగర్‌కు చెందిన దాసరి భూమయ్య పోలీస్ శాఖలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. ఆర్ఎస్ఐగా 1992లో భూమయ్య పోలీస్‌శాఖలో చేరాడు. 1996లో సివిల్ ఎస్ఐగా కన్వర్ట్ అయ్యాడు. కరీంనగర్ జిల్లాలోని దాదాపు 12 పోలీస్స్టేషన్లలో ఎస్ఐగా పనిచేశాడు. 2012లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందాడు. ఆదిలాబాద్, హుస్సా బాద్, మంథిని తదితర ప్రాంతాలతోపాటు హైదరాబాద్‌లో సీఐడీ విభాగంలో పనిచేశాడు. ఇతనికి ఏ.విజరుపాల్ రెడ్డి అనే రియాల్టర్ పరిచయమయ్యాడు. ఇద్దరి కలిసి గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్ తదితర ప్రాంతాలల్లో భూములు కొనడం, విక్రయించడంతోపాటు సెటిల్మెంట్లు చేసేవారు. అయితే వారిమధ్య ఆర్థికపరమైపన తేడాలు రావడంతో భూమయ్య కక్ష పెంచుకున్నాడు. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ ట్రాఫిక్ విభాగంలో పనిచేసిన సమయంలో 2018లో భూమయ్యపై ఏసీబీ రైడ్చేయడంతో జైలుకెళ్లాడు. అయితే తనను ఏసీబీకి రియాల్టర్ ఏ.విజరు పాల్ రెడ్డి పట్టించాడని అనుమానించాడు. జైలు నుంచి తిరిగొచ్చిన భూమయ్య పెద్దపల్లికి చెందిన తన స్నేహితుడు వ్యాపారి ఎం.చంద్రయ్యను కలిశాడు. విజరుపాల్ రెడ్డిని ఎలాగైనా అడ్డు తొలిగించుకోవాలని చంద్రయ్యకు చెప్పాడు. హత్యచేయాలంటే రూ.40 నుంచి 50లక్షలు ఖర్చవు తుందని చంద్రయ్య చెప్పాడు. చివరకు ఇద్దరి మధ్య రూ.20లక్షలకు ఒప్పందం కుదిరింది. అడ్వాన్స్‌గా రూ. ఐదు లక్షలు తీసుకున్న చంద్రయ్య ఖాజీపేట్, మంచిర్యాల్‌కు చెందిన కిరాయి హంతకులు (పాత నేరస్తులు) గొర్రె రాయిగొల్ల అలియాజ్ శంకర్, గడ్డం కుమార్‌ను సంప్రదిం చాడు. నిందితులు బీహార్ నుంచి కంట్రీమేడ్ పిస్తోల్, బులెట్స్ను కొనుగోలు చేశారు. విజయపాల్‌రెడ్డిని కదలికల ను గమనిస్తూ వస్తున్నారు. అయితే అనుమానం కలిగిన విజయపాల్‌రెడ్డి టాస్క్ఫోర్సు పోలీసులకు సమాచారం అందించాడు. నిందితులపై ప్రత్యేక నిఘావేసిన పోలీసులు సికింద్రాబాద్‌లో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీపీ తెలిపారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ టీ.శ్రీనాథ్‌రెడ్డి, ఎస్ఐలు బీ.అశోక్‌రెడ్డి, కే.శ్రీకాంత్, ఎం.అనంతచారీ, బీ.అరవింద్గౌడ్తోపాటు తదితరులు పాల్గొన్నారు.