Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిద్ధం
- బీజేపీ నాయకులకు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కార్తిక్ రెడ్డి సవాల్
నవతెలంగాణ - మీర్ పేట్
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేసిన అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే బీజేపీ నాయకులు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పి. కార్తీక్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లెలగూడలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి సబతా ఇంద్రారెడ్డి 24 గంటలూ ప్రజల మధ్య ఉంటూ పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల స్థాయిలో మహేశ్వరం నియోజ కవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఒక మహేశ్వరం నియోజకవర్గంలోనే రైతు బీమా, రైతుబంధు, దళిత బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్ల ద్వారా రూ.80 కోట్లు నేరుగా 90వేల మంది లబ్దిదారులకు అందాయని తెలిపారు. 'మన ఊరు - మన బడి' పథకం ద్వారా ప్రభు త్వ పాఠశాలలకు మౌలిక వసతుల కల్పన కోసం రూ.80 కోట్లతో పాటు సీఎస్ఆర్ ఫండ్ కింద రూ 10 కోట్లు, హెచ్ఎండీఏ నుంచి మున్సిపాలిటీలకు నిధులు, మండలా ల్లో అభివృద్ధికై ఆర్ఎన్బీ నుంచి రూ 432 కోట్ల ప్రత్యేక నిధులు తేవడం జరిగిందన్నారు. నూతన భవన నిర్మాణాల కోసం రూ. 165 కోట్లు, ముంపు సమస్య శాశ్వత పరిష్కా రం కోసం ఎస్ఏన్డీపీ నాలాల నిర్మాణానికి రూ.92 కోట్లను మంత్రి మంజూరు చేయించారని తెలిపారు. అబద్దాల పునాదులపై సగం రియల్ ఎస్టేట్, సగం రాజకీయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. సమస్యలపై అవగాహనతో కొట్లాడితే ప్రజల్లో గుర్తింపు వస్తుందని, అభివృద్ధి చేస్తున్న వారిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతారని హితవుపలికారు. రియల్ ఎస్టేట్ చేసేవారికి ప్రజా సమస్యలపై ఏం అవగాహన ఉంటుందని ఎద్దేమో చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగిందనే దానిపై జీవోల తో సహా నిధుల మంజూరు పత్రాలను ఈ మీడియా సమావేశంలో బహిరంగంగా ఇస్తున్నామని, ఇంకా అభ్యం తరాలు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమని బీజేపీ నాయ కులకు సవాల్ విసిరారు. సమావేశంలో మహేశ్వరం నియో జకవర్గ బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు ముద్దా పవన్ కుమార్, బడంగ్పేట్ అధ్యక్షులు రామిడి రామ్‌రెడ్డి, మీర్పేట్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, జలపల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షులు, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.