Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మినీ ప్లినరీని జయప్రదం చేయండి
- బీఆర్ఎస్ బోడుప్పల్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ బీఅర్ఎస్ పార్టీ మినీ ప్లినరీ సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో బీఅర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పండుగలా జరుపుకోవాలని బీఅర్ఎస్ పార్టీ బోడుప్పల్ నగర అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం పురుడు పోసుకున్న టీఅర్ఎస్ నేడు దేశ ప్రజల కష్టాలు తీర్చడానికి బీఅర్ఎస్గా అవతరించిందని తెలిపారు. అందులో భాగంగానే మేడ్చల్ జిల్లా తూంకుంట దేవారయంజల్లో జరిగే మినీ ప్లినరీ సందర్భంగా 28 డివిజన్లలో బీఅర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, పార్టీ నేతలతో కలిసి భారీ ర్యాలీగా ప్లినరీ వేదిక వద్దకు చేరుకుంటామని తెలిపారు.