Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంతోష్ నగర్
చంపాపేట్ డివిజన్ పరిధిలోని కర్మన్ ఘాట్ శుభోదయ కాలనీని ఆదర్శం గా తీర్చిదిద్దడమే ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి లక్ష్యమని డివిజన్ పార్టీ అధ్యక్షులు ముడుపు రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సహకారంతో రూ.8.80 లక్షలతో కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను బస్తీ వాసులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బస్తీ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యేకు అభినందనలు తెలియజేశారు. ఆయన వెంట ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్, మాజీ వార్డ్ మెంబర్ శివ గౌడ్, చంపాపేట్ డివిజన్ కార్మిక విభాగం అధ్యక్షులు నరేష్, ఎస్సీ సెల్ సెక్రటరీ రాజు, నాయకులు గోగు శేఖర్ రెడ్డి, బీరమ్మ, సుజాత వెంకటయ్య, తదితరులు ఉన్నారు.