Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి చామకూర మల్లారెడ్డి
- మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభం
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు .సోమవారం కీసర మండలం చీర్యాల, తిమ్మాయిపల్లి గ్రామాల్లో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా దాదాపు రూ 50 లక్షలతో ఆధునికరించిన ( నూతన ఫర్నిచర్, బాత్ రూమ్లు, కిచెన్ షెడ్,) మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలను (రెండు గ్రామాల్లో) మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం సీఎం కేసీఆర్ రూ.7300 కోట్లతో అభివద్ధి పనులు చేపడుతున్నారని తెలిపారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని గొప్ప వ్యక్తులుగా ఎదగలన్నారు.అనంతరం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేసిస్కూల్, క్లాస్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమలలో ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మి నారాయణ, వైస్ చైర్మెన్ జె.సత్తిరెడ్డి, చీర్యాల సర్పంచ్ తుంగ ధర్మేందర్ ,ఉప సర్పంచ్ జి.తిరుమల్ రెడ్డి, తిమ్మయి పల్లి సర్పంచ్ పెంటయ్య ,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలక్రిష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జలాల్ పురం సుధాకర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.