Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముషీరాబాద్ బీఆర్ఎస్ మీటింగ్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-ముషీరాబాద్
దేశంలో బీజేపీకి కుల మతాల పైన రాజకీయాలు చేయడం తప్ప వేరే ఎజెండా లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గురువారం ముషీరాబాద్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనాన్ని బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళముందే ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్యులర్ నాయకుడు అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రిగా పదవులు అనుభవిస్తున్న కిషన్ రెడ్డి ముషీరాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఐదు డివిజన్లకు చెందిన బిజెపి కార్పొరేటర్లు అభివృద్ధి, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నిర్మాణదారుల నుండి అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు ముఠా జైసింహ, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యులు వి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, డివిజన్ అధ్యక్షులు రావులపాటి మోజెస్, ఎం రాకేష్ కుమార్, వై శ్రీనివాసరావు,బల్ల శ్రీనివాస్ రెడ్డి ,నర్సింగ్ ప్రసాద్ ,వల్లాల శ్యామ్ యాదవ్, మన్నె దామోదర్ రెడ్డి, కొండా శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటకృష్ణ (బబ్లు) సోమ సుందరం, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.