Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
బీఅర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో జరిగిన బీఅర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభకు ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. మియపూర్ నరైన్ గార్డెన్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. అంతకుముందు ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ కార్యాలయం, ఎల్లమ్మబండ చౌరస్తా, అంబేడ్కర్ నగర్, జన్మభూమి కాలనీ, జయా నగర్, సాయి నగర్, ఆల్విన్ కాలనీ-జై శంకర్ కాలనీ, ఆల్విన్ కాలనీ ఫేస్-2, వెంకటపాపయ్య నగర్, రాజీవ్ గాంధీ నగర్, మొగులమ్మ కాలనీ, పీజేఆర్ నగర్, కాలనీలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకురాళ్లతో కలిసి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.