Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
వికలాంగుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపవద్దని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్.పి.ఆర్.డి) మేడ్చల్ జిల్లా కార్యదర్శి జంగిటి మల్లేష్ డిమాండ్ చేశా రు. ఈ మేరకు మంగళవారం జగద్గిరిగుట్ట డివిజన్ జగ దంబ మార్కెట్ నుండి చివరి బస్ స్టాప్ వరకు ఎన్ పి ఆర్ డి మండల, డివిజన్, కమిటీలతో కలిసి వికలాంగుల కు పెన్షన్ పెంపు, ఉచిత విద్యుత్, ప్రయాణ సౌకర్యాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం ర్యాలీ నిర్వహించారు. నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ఏప్రిల్ 1 నుండి 30 వరకు నిర్వహించే ప్రచార ఉద్యమా న్ని జయప్రదం చేయాలని కోరుతూ ఎన్ పి ఆర్ డి సభ్యులతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు. వికలాం గులకు పదివేల పెన్షన్ పెంచి ప్రతినెల ఐదో తేదీలోపు చెల్లించాలని, వికలాంగులకు విద్యుత్ 250 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రస్తు తం ఉన్న రోస్టర్ ను సవరించాలని,40 శాతం వైకల్యం ఉన్న వికలాంగులకు యుడిఐడి కార్డులను వెంటనే పంపి ణీ చేయాలని, విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్పి ఆర్డి సభ్యులు అంజు రాణి, డి ఆదర్శ్, బాల నర్సయ్య, కె. అనంతం, ఎం. రాజు, మంజుల, భారతి పాల్గొన్నారు.