Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
కోర్టు దిక్కునకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని అల్లాపూర్‌కు చెందిన కొడిచెర్ల సత్యమ్మ డిమాండ్ చేశారు. అల్లాపూర్ లోని సర్వేనెంబర్ 18లో తనకు చెందిన భూమిలో ఇటీవలే జిహెచ్ఎంసీ అధికారు లు నాలా నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో మంగళ వారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 60 ఏండ్ల క్రితం ఇక్కడ తమ పూర్వీ కులు 4.17 ఎకరాల స్థలం కొనుగోలు చేశారనీ, సుమారు 25 ఏండ్ల క్రితం తన భర్తకు ఓ రెవెన్యూ అధికారికి గొడవ జరగడంతో అతను కక్షపూరితంగా ఇది ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో మార్చారని ఆరోపించారు. అప్పటి నుంచి ఈ విషయమై ప్రభుత్వంతో కోర్టులో పోరాడుతున్నామని తెలి పారు. ఇప్పటికీ ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతు న్నట్టు వివరించారు. ఇంకా కోర్టు తీర్పు విలవడక ముందే జీహెచ్ఎంసీ అధికారులు ఇది ప్రభుత్వ భూమి అని పేర్కొ ంటూ నాలా నిర్మాణ పనులు చేపట్టారని తెలిపారు. ఇదే విషయంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశా రు. హైకోర్టు నిషేధాజ్ఞలు ఉన్న ఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టడం కోర్టును ధిక్కరించడమే అవుతుందన్నారు. సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా నిలిపివేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పెద్ది అంజయ్య, ప్రకాష్, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.