Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ/బాలానగర్
కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.వేల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధ వరం కృష్ణారావు అన్నారు మంగళవారం కూకట్పల్లి భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ ప్రతినిధుల సభకు ఆయనతో పాటు రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు కుర్మయ్యగారి నవీన్ కుమార్ హాజరయ్యారు. ఈ సభలో తొమ్మిది తీర్మానాలను ప్రవేశపెట్టగా సభకు హాజరైన సభ్యులు ఏక కంఠంతో ఆమోదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గం లో రూ.వేల కోట్ల నిధులతో ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు , అండర్ పాసులు, రోడ్ల పునరుద్ధరణ, మంచి నీటి, డ్రైనేజీ సదుపాయాలు కల్పించా మన్నారు. నియోజకవర్గంలో వేల కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారన్నారు. పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకూ తగిన గుర్తింపు ఉంటుందన్నా రు. తొమ్మిదేండ్ల కాలంలోనే వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా మిషన్ భగిరథ పథకం ద్వారా తాగునీరు అందించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఐడీఎల్ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ప్రతి నిరుపేదకీ అందజేస్తామని తెలిపారు. ఈ సభలో నియోజకవర్గ కార్పొరేటర్లు, మాజీ కార్పోరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, డివిజన్ అధ్య క్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని బోయిన్పల్లి, బాలానగర్, ఫతేనగర్, మూసాపేట, బేగంపేట, కూకట్ పల్లి, కెపిహెచ్బీ, అల్లాపూర్, వివేకానంద నగర్ తదితర డివిజన్ల కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఖార్డ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు సన్మానం
నిరుపేదలు ఎక్కడ ఉంటే అక్కడ వారికి ఖార్డు స్వచ్చంద సంస్థ ప్రతినిధులు అండగా ఉంటారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో ప్రజా ప్రతినిధులు ఖార్డ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సుమన్ మల్లాది, మంజులతలకు ఆయనతో పాటు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్‌రావు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలలు ఎక్కడ ఉంటే అక్కడ వారికి ఖార్డు స్వచ్ఛంద సంస్థ నిర్వాకులు సుమన్ దంపతులు అండగా నిలుస్తూ వారికి నిత్యావసర సరుకులు అందించడమే కాకుండా సమా జంలో అందరూ ఎదగాలన్న ఉద్దేశంతో వృత్తి విద్యా కోర్సులు ఉచి తంగా అందిస్తున్నాన్నారు. అందుకు తగ్గ ప్రోత్సాహకాలు ఇవ్వడం నిజంగా అభినందించదగ్గ విషయమన్నారు.