Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
మూసాపేట్ డివిజన్ వార్డు కార్యాలయంలో అన్ని బస్తీల నాయకులు, బస్తీ వాసులతో కలిసి, అన్ని విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, స్థానిక సమస్య లను వివరించి సత్వరమే పరిష్కరించాలని మూసాపేట్ కార్పొరేటర్ కోడిచెర్ల మహేందర్ సూచించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బస్తీలో ఉన్న సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్క రించేందుకు ఏర్పాటు చేసిన సమావేశమనీ, ఈ సమా వేశంలో బస్తీ ప్రజలు వివరించిన తమ సమస్యలపై సంబ ంధితశాఖ అధికారులు సానుకూలంగా స్పందించారని తెలి పారు. కాలనీ, బస్తీవాసుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా వారు ఆలోచించాలని అధికారులకు సూచించారు. ప్రతి బస్తీ, కాలనీ నుంచి వచ్చిన బస్తీ అధ్యక్షులకు కాలనీవాసులకు వారి వారి బస్తీ సమస్యలను గుర్తించి, వారి సమస్యల ఫిర్యాదు పత్రాలను, పూర్తిగా సంబంధిత అధికారులకు అందించామనీ, వారు వీలైనంత త్వరగా అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తారని కార్పొరేటర్ మహేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ వెంకటరమణ, మూసాపేట సెక్టార్ ఎస్సై రామకృష్ణ, జలమండలి మేనేజర్ సాలోమి, వెటర్నరీ డాక్టర్ లింగ స్వామి, విద్యుత్ అధికారులు, ఇతర అధికారులు, బస్తీ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.