Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడోసారి గెలిచి కేసీఆర్కు కానుకగా ఇస్తాం
- ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మా పాలన
- మేడ్చల్ నియోజకవర్గ ప్రతినిధుల సభలో మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
మేడ్చల్ గడ్డ గులాబీ అడ్డ అని మూడోసారి గెలిచి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామ కూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రతినిధుల సభ తూంకుంటలోని జాన్వీ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలోని బీఅర్ఎస్ సర్కారు ప్రజా సంక్షేమ పాలన సాగిస్తూ అన్ని వర్గాలకు సమాన న్యాయం చేస్తున్నదని అన్నారు. ప్రతీ ఇంటికి ఎదో ఒక సంక్షేమ పథకం అందించిన ఘనత కేసీఆర్ సర్కారుకు దక్కిందని అన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేని బడ్జెట్ మేడ్చల్ కు కేటాయించినట్టు తెలిపారు.గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చాలా వరకు పూర చేశామని ఇంకా పెండింగ్లో ఉన్న హామీలు పూర్తి చేసేలా ముందుకు సాగుతున్నామని చెప్పారు.
మాది సంక్షేమ పాలన - బీజేపీ ది విద్వేష పాలన....
కేంద్రంలో నరేంద్ర మోడీ నేతత్వంలో ఏర్పడిన బీజేపీ సర్కా రు మోదటి నుండే ప్రజల మద్య విద్వేషాలను రెచ్చగొట్టి మత రాజకీయాలు చేస్తున్నదని కానీ చైతన్యవంతమైన తెలంగాణలో బీజేపీ నేతల పప్పులు ఉడకవని మంత్రి అన్నారు. సర్వ మతాలను గౌరవించేలా కేసీఆర్ పాలన సాగుతుందని అందుకే హిందు, ముస్లిం,క్రిస్టియన్ల పండుగలకు వారికి అవసరమైన కానుకలు అందిస్తున్నామని తెలిపారు. చేవెళ్ళ సభలో తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశామో చెప్ప లేకనే అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని కేంద్ర హౌం మంత్రి అమీత్ షా మాట్లాడారని ఐక్యమత్యంగా జీవనం సాగిస్తున్న ప్రజల మధ్య వైషమ్యాలు పెం చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని వాటిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మేడ్చల్ ఇన్చార్జ్ చామకూర మహేందర్ రెడ్డి,బీఅర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్,బోడుప్పల్ నగర అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి,జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య వివిధ పురపాలక సంఘాల చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
తీర్మానాలకు ఏకగ్రీవ అమోదం..
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ బీఅర్ఎస్ ప్రతినిధుల సభలో కొంత మంది నాయకులు ప్రవేశపెట్టిన పలు తీర్మానాలకు సభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.దళిత బంధు పథకం అమలు,బీసీ సంక్షేమం,కులవత్తుల సంక్షేమం, మహిళ సంక్షేమం, మైనా రిటీల అభివద్ధికి కావాల్సిన ప్రణాలికలు, కేసీఆర్ కిట్,కల్యాణ లక్మ్షి,షాది ముబారక్, రైతు బంధు,పట్టణ,పల్లె ప్రగతి, ఎస్టీ సంక్షేమం, రిజర్వేషన్ల పెంపుదల,కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యచరణ లాంటి వాటిపై తీర్మానాలు ప్రవేశ పెట్టగా సభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
పట్టణ,పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం - పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి
రాష్ట్రంలోని పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఈ పథకాన్ని అద్యయనం చేసేందుకు వివిధ రాష్ట్రాల ప్రతిని ధులు మన రాష్ట్రంలోని పంచాయ తీలకు, నగర కార్పొరేషన్లను సందర్శి స్తున్నారని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. పట్ట,పల్లె ప్రగతి పై తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాలు, పల్లెల నిరంతరం సుందరంగా ఉండేందుకు స్థానిక పాలక సంస్థలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛను కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు.ప్రతి చోటా పల్లె ప్రకతి వనాలు, పట్టణ ప్రకతి వనాలు ఏర్పాటు చేసి హరిత హారంతో ప్రాంతాలన్నీ పచ్చదనంతో కళకళలాడేలా చేశాని తెలిపారు. అదే విధంగా వైకుంఠ దామాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయింపు చేసి ఆఖరి మజిలీ ఆనందంగా ఉండేందుకు తోడ్పాటును అందించారని అన్నారు. ఈ తీర్మానానికి సభ ప్రతినిధులు ఏకగ్రీవంగా అమోదం తెలిపారు.
మోడీ విధానాలతో ధరలకు ఆజ్యం : మంద సంజీవరెడ్డి
బీఆర్ఎస్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ఆదాయలు పెరగటంలేదు.. కానీ, నిత్యావసరాల ధరలు మాత్రం సామాన్యుడికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయన్నారు. ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్టులేదని సగటుజీవి అనుకుంటున్న మాటలివి... మోడీ ప్రభుత్వం ఇంధన ధరలు, గ్యాస్ ధరల్ని బాదేస్తుంటే.. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయని తెలిపారు. దీనికి తోడుగా కేంద్రం ఇస్తానన్న ఏడాదికి కోటి ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో సరైన ఉపాధిలేక కోట్లాది కుటుంబాల బడ్జెట్ తారుమారైందన్నారు. ఓ వైపు దిగజా రిన పొదుపు.. మరోవైపు ఎగబాకుతున్న ధరలతో బతుకుతంటగా మారిందని అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతున్నదన్నారు మానవుని దైనందిన జీవితంలో పొద్దున్నే లేచిన కాన్నుంచి పడుకునే వరకు వాడే అనేక నిత్యావసర వస్తువుల ధరలను పెంచి పేద,మద్యతరగతి ప్రజల నడ్డి విరిచిన ఘనత కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ నేతత్వంలోని బీజేపీ సర్కారుదేనని అన్నారు. సంపదను సష్టించడంలో కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలతో ప్రజల బతుకు బజారులో పడిందనే చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న ధరలపై సంజీవరెడ్డి ప్రవేశ పెట్టిన తీర్మానానికి సభ ప్రతినిధుల నుండి విశేష స్పందన వచ్చింది.