Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య
నవతెలంగాణ-మీర్పేట్
మతోన్మాద బీజేపీ నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాల మకుల జంగయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇంటింటికీ సీపీఐ ప్రజా పోరు యాత్రలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం లెనిన్ నగర్ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహిం చారు. ఈ సందర్భంగా పాలమాకుల జంగయ్య మాట్లా డుతూ.. ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు ''బీజేపీకి హటా వో దేశ్ కు బచావో'' పేరుతో దేశవ్యాప్తంగా ప్రజల వద్దకు వెళ్లి ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ విధా నాల వల్ల దేశంలో వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యా యాలను వివరిస్తున్నామని తెలిపారు. నిరంకుశ హిట్లర్ తరహా పాలన సాగిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించి వామపక్ష ప్రగతిశీల లౌకిక ప్రజాస్వామిక శక్తులతో కూడిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా ప్రజలను చైతన్యపరచాలని కార్యకర్తలకు సూచించారు. మతోన్మాదం ముసుగులో భారత రాజ్యాంగానికి రద్దుచేసి దాని స్థానంలో మనువాద రాజ్యాంగం తీసుకురావాలని ఆర్ఎస్ఎస్ పెద్ద కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ గమనించి భారత రాజ్యాంగాన్ని కాపాడు కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, బి.బాలరాజు, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. చంద్రయ్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పానగంటి పర్వతాలు, ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, మహేశ్వరం నియోజకవర్గ కార్యదర్శి బి.దత్తు నాయక్, బాలాపూర్ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, మహేశ్వరం కార్య దర్శి పల్నాటి యాదయ్య, కందుకూరు మండల కార్యదర్శి కె.రాజు, మహేశ్వరం నియోజకవర్గ సహాయ కార్యదర్శి మారేగోని ప్రవీణ గౌడ్, డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు గణేష్, బాలాపూర్ మండల నాయకులు పాల్గొన్నారు.