Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
హయత్‌నగర్ మండలం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వీరన్న గుట్ట నుంచి సీపీఐ మండల కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ సీపీఐ ప్రజాపోరు యాత్ర నిర్వహించారు. ఇందులో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యాది రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ విఫలమైందన్నారు. ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నిత్యా వసరాల వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయని, సామా న్యుడు బతకలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ కంపెనీలకు ధారా దత్తం చేయాలని రైతును ముంచే మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చిందని చెప్పారు. రైతుల ఉద్యమంతో వెనక్కి తగ్గి ప్రధాని మోడీ క్షమాపణ చెప్పారన్నారు. ఒక్కొక్కటిగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని కారు చౌకగా తన దత్తపుత్రు లకు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న అనేక చట్టాలను 4 కోడ్లుగా మార్చి.. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని మంట కలిపి మనువాదాన్ని అమలు చేసేందుకు యత్నిస్తున్నా రన్నారు. వీటన్నింటిపై ప్రజలను చైతన్య పరుస్తూ బీజేపీని తరిమికొట్టడానికి ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
మన్సూరాబాద్ డివిజన్, హయత్‌నగర్ డివిజన్, వనస్థలిపురం డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో గడప గడపకూ సీపీఐ కరపత్రాలు పంచుతూ జనాన్ని చైతన్యవం తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శులు శ్రీదేవి, సక్రు, ఏఐవైఎప్ జిల్లా అధ్యక్షుడు పోలోజు లక్ష్మణాచారి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్ గౌడ్, మహిళా సమాఖ్య మండల అధ్యక్ష కార్యదర్షులు సరిత, సుభద్ర, సోమన్న, దలితహక్కుల సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేష్ పాల్గొన్నారు.