Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం రాష్ట్ర ఫ్రధాన కార్యదర్శి విఘ్నేశ్
నవతెలంగాణ-తుర్కయాంజల్
వడ్డెర వృత్తిదారుల రుణాలను వెంటనే రుణాలు ఇవ్వాలని వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లపు విగేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడ్డెర వృత్తిదారుల సంఘం రంగారెడ్డి జిల్లా మఖ్యకార్య కర్తల సమావేశం తుర్కయంజాల్లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, కార్యదర్శులు కుంచం వెంకటకృష్ణ, పల్లపు విఘ్నేశ్, చేతి వీత్తిదారుల జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్ గోరెంకల నరసింహ మాట్లా డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏండ్లు గడుస్తున్నా వడ్డెరల బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. వడ్డెర వృత్తిదారులు నేటికీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, సమాజానికి దూరంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో సుమారు 4000 సొసైటీలు ఉన్నా.. ఇప్పటికి ఒక్క పైసా ఖర్చు చేయడం లేద న్నారు. వడ్డెర వృత్తిదారులు చనిపోతే కనీసం ఎక్స్గ్రేషియా కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డెర బంధును ప్రకటించి వెనుకబడిన ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులు, పింఛన్లు, ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దేరంగుల రామకృష్ణ, ఇదికట్ల యోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ జిల్లా కన్వీనర్ గా దేరంగుల లక్ష్మీపతి, కో కన్వీనర్లుగా గోగుల రాజు, తన్నీరు చెన్నమ్మ, సభ్యులుగా గుర్రం సత్యనారాయణ, గండికోట సత్యం, పల్లపు కృష్ణంరాజు, బొంత రాంమూర్తి, దేరంగుల బాలకృష్ణ, దేరంగుల సుదర్శన్, కుంచం బిక్ష్మమయ్య ఎన్నికయ్యారు.