Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదేం అని ప్రశ్నిస్తే దౌర్జన్యం
- న్యాయం చేయాలంటూ బాధితుల వేడుకోలు
నవతెలంగాణ-బోడుప్పల్
బలహీన వర్గాల సంక్షేమం కింద నాటి ప్రభుత్వం తనకు ఇంటి జాగను కేటాయించిన స్థలంలో ఇతరులు అధికా రులు, స్థానిక నేతల సహకారంతో దర్జాగా కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపట్టి తమకు అన్యాయం చేస్తున్నారని ఓ మహిళ మీడియా ముందు తన ఆవేదనను వెలిబుచ్చుకున్న సంఘటన బోడుప్పల్ మునిసిపల్ కార్పోరేషన్ లో మంగళవారం చోటు చేసుకుంది.బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ లో నివాసం ఉంటున్న దళిత సామాజిక వర్గానికి చెందిన ఎం.సావిత్రికి 2002 సంవత్సరంలో అప్పటి సర్కారు బలహీన వర్గాల సంక్షేమ పథకం కింద బోడుప్పల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 63/1 లో 60 గజాల ఇంటి స్థలం కేటాయించి పట్టా సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే సదరు మహిళ అర్దిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఒక చిన్న రూం మాత్రమే వేసుకుని మిగిలిన స్థలాన్ని ఖాళీగా ఉంచింది ఇదే అదునుగా భావించిన భూ కబ్జా దారులు ఆ ఖాళీ స్థలంపై కన్నేసి ఫోర్జరీ సంతకాలతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు తయారు చేసి అది తమ స్థలం అంటూ సదరు మహిళను బెదిరింపు లకు గురి చేసి ఇంటి నిర్మాణం చేపట్టారు. దాంతో చేసేదేం లేక సదరు మహిళ మేడిపల్లి మండల రెవెన్యూ అధికా రులను ఆశ్రయించగా వారు ఎలాంటి చర్యలు తీసుకో కుండా తాత్సారం చేసి కబ్జా దారులకు సహకరించారని ఆమె వాపోయింది. మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో పిర్యాదు చేయగా విచారణ అదేశాలు రావడంతో అసలు విషయం బయటపడింది.దీంతో విచారణ జరిపిన మేడిపల్లి రెవెన్యూ అధికారులు తప్పుడు పత్రాలతో ఇంటి నిర్మాణం చేపట్టినట్టు నిర్ధారణకు వచ్చి కబ్జా చేసిన వారిపై మేడిపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు నలుగురు వ్యక్తులు గడ్డం రాజు,అదిములం కరుణకార్,పడిశాల మహేందర్, కృష్ణ అనే వ్యక్తులపై పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
'కేసులు నమోదైన న్యాయం జరగడం లేదు'
రెవెన్యూ అధికారులు తప్పుడు పత్రాలు అంటు నిర్ధారణకు వచ్చి మేడిపల్లి పీఎస్ లో పిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి అయినా బాధిత మహిళ తనకు న్యాయం జరగడం లేదంటూ కన్నీటి పర్యంతమైంది. తన స్థలం వద్దకు వెళితే చంపుతామని బెదిరింపులకు పాల్పడతున్నారని వాపోయారు. తమకు ఏకైక ఆధారమైన ఇంటి స్థలాన్ని తమకు కేటాయించాలని కోరారు. కబ్జా దారుల వెనక స్థానికంగా ఉన్న వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఉన్నారని ఆరోపించారు.