Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
మానవ సమాజానికి సామాజిక సమతా సూత్రాన్ని ధార్మిక విలువలతో కూడిన శ్రీ రామానుజాచార్యుల బోధనలు ఆదర్శనీయం అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మీర్ పేట్ డివిజన్ హెచ్బీ కాలనీ డివిజన్లో రామానుజాచార్యుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రపంచానికి సమతా దార్శని కుడైన శ్రీ రామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని హైదరాబాద్లో స్థాపించడం అద్భుతమన్నారు. శ్రీ చినజీయర్ స్వామి, వారి అశేష అనుచరులు, అభిమానులు ఇందుకు సంబంధించి మహా అద్భుత మైన కషి చేసారని కొనియాడారు. రామానుజాచార్యుల మానవులు అందరూ సమానమని, సమానత్వం కోసం వెయ్యేండ్ల క్రితమే ఎంతో కృషి చేశారన్నారు. బీఎల్ఆర చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి గుమ్మడి జంపాల్ రెడ్డి పాల్గొన్నారు.
నాచారం : మర్రిగూడ ఎన్ఎఫ్సి చౌరస్తా లోని విరాట్ విగ్రహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బండారి లక్ష్మారెడ్డి పూలమాల లేసి నివాళులర్పించారు. బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతిని ధులు కటార్ల భాస్కర్, మహేష్, గుమ్మడి జంపాల్ రెడ్డి, బాలకష్ణ, రామానుజా సేవా ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.