Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బోస్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
మోడీ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత క్రూర మైందనీ, నియంతృత్వ మోడీ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశంలో పేదరికం, అసమానతలు, అభద్రత భావాలు పెరిగిపోయాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.బోస్, ఈ.టి.నరసింహ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను ద్వంసం చేస్తూ, హానికరమైన విధా నాలను అవలంబిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని 'బీజేపీ హటావ్-దేశ్ బచావ్' నినాదంతో ఇంటింటికీ సీపీఐ కార్యక్రమంలో భాగంగా సీపీఐ శ్రేణులు మంగళవారం లిబర్టీ, పైగV్‌ా కాలనీ, బషీర్ బాగ్, పూల్ బాగ్, పర్దివాడా, బ్యాండ్ లైన్స్, ఎల్బీ స్టేడియం తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. దుకాణాలు, ఇంట ింటికీ తిరిగి బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కోరారు. ఈ సందర్బంగా వి.ఎస్.బోస్, ఈ.టి.నరసింహ మాట్లాడుతూ అధికారం కోసం బీజేపీ తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు దేశంలో అసత్యాన్ని, విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తోందన్నారు. మోడీ సర్కార్ సెక్యులర్ భావజాలానికి స్మశాన వాటికగా మార్చి ప్రజలు కలిసి శాంతియుతంగా జీవించలేని భారతదేశాన్ని సృష్టిస్తుందన్నారు. బీజేపీ పాలనలో నిరుద్యోగం, అభివృద్ధి లేమీ, నిత్యావసరాల ధరల పెరుగుదల, కష్టాలు మొదలైన వాటి వల్ల సామాన్యుల జీవన స్థితి మరింత దయనీ యంగా మారిందని చెప్పారు. సుస్థిరమైన భారతదేశాన్ని నిర్మించకుండా, ప్రజల కష్టాలను గాలికొదిలేసి ద్వేషం, విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్.ఛాయాదే వి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పను లకు శంకుస్థాపనలే జరుగుతున్నాయనీ, పనులు ప్రారం భం కావడం లేదనీ, ముందుకు సాగడం లేదన్నారు. మురికి వాడల్లో నివసిస్తున్న పేదల గుడిసెలను క్రమబద్దీక రించి పట్టాలు మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరంలో పూర్త యిన డబుల్ బెడ్ రూం ఇండ్లను తక్షణమే అర్హులైన పేద లకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి స్టాలిన్, రాష్ట్ర సమితి సభ్యులు బి.వెంకటేశం, నగర నేతలు నెర్లకంటి శ్రీకాంత్, ఆర్.మల్లేష్, ఆరుట్ల రాజ్ కుమార్, భిక్షపతి యాదవ్, సీహెచ్.జంగయ్య, సిహెచ్.శ్రీనివాస్, లతీఫ్, జె.కుమార్, తదితరులు పాల్గొన్నారు.