Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి చామకూర మల్లారెడ్డి
- మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అన్ని రకాలుగా అండగా ఉంటూ వారి సంక్షేమానికి నిత్యం కృషి చేస్తోందని, ఈ విషయంలో ఇప్పటికే చేపట్టిన అభివద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మెన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోరు కుమార్, అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ,జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) దేవ సహాయంతో పాటు జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా పరిషత్ సమావేశాన్ని నిర్వహించగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి, వారి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అందజేస్తోందని తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వ ఉత్తర్వులు 58, 59 ప్రకారం భూములకు సంబంధించి పట్టాలు అందజేయడం జరిగిందని, ప్రస్తుతం వారు సొంత ఇండ్లు కలిగిన వారిగా మారారని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూస్తూ ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. జిల్లా అభివద్ధికి అన్ని శాఖల అధికారులు కృ షి, ప్రజాప్రతినిధుల సమన్వయంతో అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేయాల్సిందిగా కోరారు. జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు ఇదేతీరున అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో చేపడుతున్న ఆయా కార్యక్రమాలపై సమావేశంలో ఆయా శాఖలు చేపడుతున్న కార్యక్రమాలు, వివిధ అంశాలపై జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు సంబంధిత అధికారులను ప్రశ్నించగా సంబంధిత శాఖల అధికారులు సమాధానాలిచ్చి అందుకు సంబంధించి పూర్తి వివరాలను వివరించారని జిల్లా కలెక్టర్ అమోరు కుమార్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సత్వరమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో వెంటనే స్పందించాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాను అభివృద్ధిలో ముందుస్థానంలో ఉండటం ఎంతో ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. మున్ముందు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశానికి ముందు జిల్లా కలెక్టర్‌గా అమోరుకుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లా పరిషత్ సమావేశం నిర్వహిస్తున్నందున వారికి జిల్లా పరిషత్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మూడుచింతపల్లి జెడ్పీటీసీ సభ్యులు సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.