Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజ్గిరి
నియోజకవర్గంలోని గౌతంనగర్ డివిజన్లో రోడ్డు మధ్యలో ఉన్న రాక్‌ను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతారావు ఆదేశాల మేరకు కార్పోరేటర్ మేకల సునీత రాము యాదవ్ పర్యవేక్షణలో బుదవారం అధికారులు తోలగించారు. ఈ సందర్భంగా కార్పోరేటర్ మాట్లాడుతూ రోడ్డు మధ్యలో రాక్ ఉండడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడినాయని, ప్రజల మెరుగైన ప్రయాణం కోసం రోడ్డు మధ్యలో ఉన్న రాక్‌ను తొలగిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, వర్క్ ఇన్స్పెక్టర్ నరేందర్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.