Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్
నవతెలంగాణ- నేరేడ్మెట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ అన్నారు. బుధవారం ఆయన వినాయకనగర్ డివిజన్ లో మసీదు గల్లీలో చేపట్టిన 'హాత్ సే హాత్ జోడో యాత్ర' లో ముఖ్య అతిథిగా హజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ 500 లకే గ్యాస్ సిలిండర్ , 80 గజాల స్థలమున్న పేదలకు ఇండ్ల నిర్మాణం కోసం రూ 5 లక్షలు రుణ సహాయం, అర్హులైన నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, ఆరోగ్యశ్రీ రూ. 5 లక్షల వరకు అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ వినాయక్ నగర్ డివిజన్ అధ్యక్షులు సంతోష్ ముదిరాజ్, బీ బ్లాక్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, మీడియా కన్వీనర్ గుత్తి రామచందర్, ఎంఆర్ శ్రీనివాస్ యాదవ్, నరసింహ గౌడ్, హనుమంతు, కీర్తి గణేష్, దుర్గ సాయి, యు. సాయికుమార్, అమర్నాథ్, బాలకృష్ణ, ఆశ, సాయిరాం, జెకె సాయి, గిరి యాదవ్, అశోక్ యాదవ్ పాల్గొన్నారు.