Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సత్య ప్రసాద్
- ఏఐవైఎఫ్ 64వ ఆవిర్భావ దినోత్సవం
నవతెలంగాణ-కాప్రా
నేటి యువత జాతీయ సమగ్రత కోసం పాటుపడాలని, మతతత్వ విద్వేషాలు రూపుమాపాలని అఖిల భారత యువజన సమాఖ్య మేడ్చల్ జిల్లా అధ్యక్షులు టి.సత్య ప్రసాద్ అన్నారు. ఏఐవైఎఫ్ 64వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈసీఐఎల్‌లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ ముందు ఏర్పాటు చేసిన జెండాను సత్య ప్రసాద ్ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధన కోసం ఏఐవైఎఫ్ నిరంతరం పోరాటాలు చేస్తున్నదని అన్నారు. నేటి పాలకులు స్వార్థ రాజకీయాల కోసం యువతను చెడు మార్గంలో పయనించేలా చేస్తున్నారని, సమాజ బాధ్యతను నేర్పకుండా ...సమాజం అభివృద్ధి సాదించదని అన్నారు. ఈ తరుణంలోనే ఏఐవైఎఫ్ దేశ వ్యాప్తంగా పౌరులందరికి సమాన విద్య అందించాలని, వైద్యం అందించాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే నినాదంతో ఉద్యమిస్తున్నదని తెలిపారు.బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో మతోన్మాదం హెచ్చుమీరిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కాషాయ భావజాల విధానాలను, పోకడలను ప్రజలపై రుద్దడానికి తీవ్ర దుష్ట ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ చర్యలను శాస్త్రీయ దక్పథం కలిగిన భారత పౌరులు తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించి, అమలు చేయాలని కోరారు. అలాగే ప్రయివేటు రంగాలలో రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు సల్మాన్ బైగ్, కాసర్ల నాగరాజు, జిల్లా సమితి సభ్యులు ఇమ్రాన్ ఖాదీర్, యాస్మిన్, కిరణ్మయి సింధు, పావని, సందీప్,కిశోర్, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.