Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్
నవతెలంగాణ-కాప్రా
గత కొద్ది రోజులుగా అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలుస్తూ, డ్రయినేజీలు పొంగడం వంటి సమస్యల దష్ట్యా డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో అధికారులతో కలిసి కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ చర్యలు చేపట్టారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండ తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒక్కసారిగా వచ్చిన వాతావరణ మార్పులు చల్లనిగాలుల వల్ల జలుబు, విషజ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కాలనీ వాసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి, హైదారాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ డైరెక్టర్ స్వామి, డీఈ రూప, ఏఈ స్రవంతి, వర్క్ ఇన్స్పెక్టర్ చారి, వాటర్ వర్క్స్ మేనేజర్ వేణుగోపాల్, కాలనీవాసులు తదితరులు పాల్గోన్నారు.