Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కంటికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ముగ్గురికి బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. బాధితులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా లక్ష 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. హబ్సిగూడా డివిజన్‌కు చెందిన విలేకరి సంతోష్ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు అయోధ్య రాజు, ఆకాంక్ష, తేజ శ్రీలు కంటికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి వెంటనే స్పందించి ట్రస్ట్ ద్వారా లక్షా యాభై వేల రూపాయలు చెక్కును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సొంత డబ్బులతో ట్రస్ట్ ద్వారా అనేక సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న లక్ష్మారెడ్డిని అభినందించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు సూరం శంకర్, చాంద్ పాషా, బోసాని పవన్, కటర్ల భాస్కర్, నేమూరి మహేష్, గుమ్మడి జంపాల్ రెడ్డి, గోలీ శ్రీనివాస్, మాస శేకర్, యుగెందర్ పాల్గొన్నారు.