Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాల జీహెచ్ఎంసీలో విలీనం కోసం కంటోన్మెంట్ వికాస్ మంచ్ పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని మొదలుపెట్టింది. బుధవారం రసూల్పూరాలో ఈ కార్యక్రమాన్ని ప్రతినిధులు గడ్డం ఏబుల్ సంకి రవీందర్ లు ప్రారంభించారు. ప్రధాని కార్యాలయానికి స్థానికులతో ఉత్తరాలు రాయించారు ఈ సందర్భంగా మంచి ప్రతినిధులు మాట్లాడుతూ అన్ని ఏర్పాట్లు పూర్తయినా విలీనం ఉత్తర్వులు ఇవ్వకుండా కేంద్రం నాన్చుడు ధోరణి చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు గాను 50 వేల మంది తో పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపడుతున్నట్టు మంచి ప్రతినిధులు వివరించారు. కార్యక్రమంలో వికాస్ మంచ్ అధ్యక్షులు గడ్డం అబేల్, ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్లతో పాటు ఎలగంటి ప్రభు గుప్తా, మమ్మద్ ఫసి, అరుణ్ యాదవ్, సాంసంగ్ రాజ్ , బాబు భారు, హరిబాబు, శ్యామ్, రాజు సత్యనారాయణ పాల్గొన్నారు.