Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
ఇంటింటికి మంచినీళ్లను అందించేందుకు కృషి చేస్తున్నట్టు కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ తెలిపారు. బుధవారం నాచారం డివిజన్ పరిధిలోని భవాని నగర్ లో గతంలో ఏర్పాటు చేసిన మంచినీటి పైప్ లైన్ల నుంచి నిత్యం లీకేజీలు, కలుషిత నీరు సరఫరా అవుతుందని తెలియజేయగా కార్పొరేటర్ వెంటనే ప్రతిపాదనలు పంపించి నూతన హెచ్డీపీ మంచినీటి పైప్ లైన్ల ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటికి నల్లా నీటిని అందించాలని లక్ష్యంతో ఇప్పటికే డివిజన్ లోని పాత పైప్ లైన్ల స్థానంలో నూతన పైప్ లైన్లు ఏర్పాటు చేసి మంచినీటి సమస్యను తీరుస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ ఇంటికి నల్లా నీళ్లు అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో బీఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్, కట్ట బుచ్చి గౌడ్, సత్యనారాయణ, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ప్రతినిధులు పరిటాల సాంబశివరావు, రామ్ రెడ్డి, నర్సింగరావు, కాళిదాస్, రమేష్, బాల్ రెడ్డి, లైన్మెన్లు బాబు, మహేష్, మల్లికార్జున్ పాల్గొన్నారు.