Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
- బీజేపీ కార్పొరేటర్ల తీరుకు నిరసనగా అధికారుల వాక్ అవుట్
- సభను వాయిదా వేసిన మేయర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
జలమండలి కార్యాలయం వద్ద మంగళవారం బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. సివరేజ్ నిర్వహణ చేపట్టడం లేదనీ, పూడీకతీయట్లేదని నిరసన వ్యక్తం చేశారు. అయితే వారు వ్యవహరించిన తీరుకు నిరసనగా చరిత్రలో తొలిసారిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని జలమండలి అధికారులు బారుకాట్ చేశారు. వారికి మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులు కూడా బయటకు వెళ్లిపోయారు.
నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జీహెచ్ఎంసీ 6వ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సంద ర్భంగా మేయర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చైతన్య స్ఫూర్తితో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుందన్నారు. సచివాలయం రాష్ట్రానికే ప్రతిష్టాత్మకమైన దనీ, దీనికి సూచనగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డు, దేశంలోనే మొదటి గోల్డ్ రేటెడ్ సెక్రెటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్‌గా రికార్డులో ఎక్కిందని తెలిపారు. మేడే సందర్భంగా ముఖ్యమంత్రి జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు వేతనం రూ.1000 పెంచడం సంతోషదాయకమన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కాలనీ రెసిడెన్షియల్, స్లమ్ ఏరియా ఫెడరేషన్ ప్రతినిధులతో కలిసి నగరంలోని 4,846 కాలనీల సమస్యలను పరిష్కరించడా నికి నోడల్ టీమ్‌లు విశేష కృషి చేస్తున్నాయని తెలిపారు. ఇందుకు 360కి పైగా టీమ్‌లు పని చేస్తున్నాయన్నారు. కుక్కకాటు నివారణ కు హై లెవల్ కమిటీ సూచనల మేరకు, యానిమల్ వెల్ఫేర్ బోర్డు మార్గదర్శాలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు అన్యాక్రాంతం కాకుండా సీఎస్ఆర్ పద్ధతిలో పలు సంస్థలు ముందుకు వచ్చాయనీ, 43 చెరువుల సుందరీకరణ పనులను రెగ్యులర్‌గా చేపడతామని చెప్పారు. బీజేపీ కార్పొరేటర్లు మాట్లా డుతూ నగరంలో సమస్యలు నెలకొన్నాయనీ, నాలాలో పూడిక తీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జలమండలి ఈడీ డాక్టర్ ఎం.సత్యనారాయణ మాట్లాడుండగా బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకు నేందుకు యత్నించారు. అయినా ఆయన మాట్లాడుతూ మంగళ వారం జలమండలి కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు వ్యవహ రించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా అధికారిని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి చర్యను నిరసిస్తూ సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించారు. వారికి జీహెచ్ఎంసీ అధికారులు మద్దతు తెలుపుతూ కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. దాంతో మేయర్ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సమావేశంలో ఎక్స్ అఫిషియో సభ్యులు ఎమ్మెల్సీ వాణ ిదేవి, మొహమ్మద్ రహమత్ బెగ్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్, అడిషనల్ కమిషనర్ ప్రియాంక అలా, ఇవిడిఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, ఈఎన్సీ జియా ఉద్దీన్, సురేష్ కుమార్, సీసీపీ దేవేందర్ రెడ్డి, అడిషనల్ సీసీపీ శ్రీనివాస్, అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెన్నెడీ, విజయలక్ష్మి, జోనల్ కమిషనర్లు శంకరయ్య, మమత, పంకజ, సామ్రాట్ అశోక్, శ్రీనివాస్ రెడ్డి, రవి కిరణ్, సెక్రెటరీ లక్ష్మి, జల మండలి డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, శ్రీధర్‌బాబు, స్వామి పాల్గొన్నారు.