Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు బైక్‌లు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన ఏసీపీ శ్రీనివాస్
నవతెలంగాణ-ఓయూ
జల్సాలకు అలవాటు పడి బైక్‌లను దొంగిలిస్తున్న నిందితులను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు పట్టు కున్నారు. వారి వద్ద నుంచి ఆరు బైక్‌లను స్వాధీనం చేసు కున్నారు. ఓయూ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాచిగూడ ఏసీపీ ఆకుల శ్రీనివాస్ కేసు వివరాలు వెల్లడించారు. మౌలాలి ఆర్టీసీ కాలనీకి చెందిన సయీద్ ఫిరోజ్ చిన్న చిన్న పనులు చేసు కుంటూ ఉండేవాడు. వచ్చిన డబ్బులు సరిపొకపోవడంతో సులువుగా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేందుకు ద్విచక్రవాహనాలు దొంగలించాలని నిర్ణయించుకున్నాడు. 2017లో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ద్విచక్రవాహనం దొంగి లించి పోలీసులకు పట్టుబడ్డాడు. 5 నెలల అనంతరం జైలు నుంచి విడుదలైన ఫిరోజ్ తార్నాకలోని అండాల్ మిక్చర్ షాప్‌లో పనిలో చేరాడు. ఈ క్రమంలో మరో దొంగ తనం చేసి 2021లో మల్కాజిగిరి పోలీసులకు పట్టుబడి మూడు నెలల జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత మౌలాలి ప్రాంతానికి చెందిన శ్యామ్ సుందర్, ఆకాశ్, మరో మైనర్‌తో పరిచయం ఏర్పడింది. మౌలాలి జెడ్టీఎస్ గ్రౌండ్లో ఫిరోజ్ వారితో కలిసి ఆర్ధిక ఇబ్బందులు గురించి మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో వారు మద్యం, పొగాకు బానిసలుగా మారి, అర్ధరాత్రి రోడ్లపై తిరిగేవారు. తనకు చెర్లపల్లి జైల్లో మనిమోహన్ శికారి అనే వ్యక్తి కలిశాడనీ, దొంగలించిన ద్విచక్రవాహనాలను ఒడిషాలో విక్రయిస్తాన ని వారికి చెప్పారు. దీంతో అందరూ కలిసి ద్విచక్రవాహనా లను దొంగిలించడం ప్రారంభించారు. బుధవారం ఉద యం అయిదున్నర గంటల సమయంలో తార్నాక ప్రాంతం లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, లాలా పేట ఫ్లై ఓవర్ కింద ఉన్న వాషింగ్ సెంటర్ సమీపంలో రెండు నంబర్ ప్లేట్స్ లేని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌తో నలు గురు యువకులు అనుమానాస్పదంగా కన్పించారు. బైక్‌ల రిజి స్ట్రేషన్ పత్రాలను అడగ్గా లేకపోవడంతో పోలీసులు తనిఖీ చేసి, అవి చోరీకి గురైన బైకులుగా గుర్తించారు. వెంటనే వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించ గా, వారి చోరీల చిట్టా బయటపడింది. వారి నుంచి వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరికి గురైన ఆరు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఓయూ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, డిటెక్టివ్ ఎస్సై భిక్షం, డిటెక్టివ్ సిబ్బంది రమాకాంత్, కిరణ్, సాయి, ప్రభా కర్, మల్లికార్జున్, గిరిబాబు, భవాని పాల్గొన్నారు.