Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న మతతత్వ రాజకీ యాలను తరిమికొడదామని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నెర్లకంటి శ్రీకాంత్ యువతకు పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ 64వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం హిమాయత్‌నగర్‌లోని ఎన్.సత్యనారాయణరెడ్డి భవన్ ఎదుట ఏఐవైఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ నేటి యువత జాతీయ సమగ్రత కోసం పాటు పడాలనీ, దేశం కోసం ప్రాణార్పణ చేసిన సర్దార్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు వారి ఆశయ సాధనకు 1959 మే 3న అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఢిల్లీలో ఆవిర్భవించిందనీ, 18 ఏండ్లు నిండిన యువతకు ఓటు హక్కు కోసం పోరాడి విజయం సాధించిన ఏకైక యువజన సంఘం ఏఐవైఎఫ్ అని చెప్పారు. కుల, మత, విచ్చిన్నకర వాదులకు ఎదురొడ్డి నిలిచిందనీ, అంటరానితనం, సాంఘి క దురాచారాలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా యువత ను పెడదోవ పట్టిస్తున్న మద్యపానం, అశ్లీల సాహిత్యం, అర్ధనగ సినిమాలకు వ్యతిరేకంగా 'క్విట్ అశ్లీలత' పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తుందన్నారు. భారతదేశ వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పి స్తూ, ఒక నిర్థిష్టమైన చట్టం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ను స్థాపించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా స్థానిక యువతకు 50 శాతం ఉపాధి అవకాశాలను కల్పి స్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు చేయాలని డిమా ండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన ద్వారా ఉద్యోగ హామీ సిద్ధిస్తుందనీ, నాణ్యమైన ఉత్పత్తి పెరుగుతుంద న్నారు. ఇప్పుడు దేశమంతటా ఉన్న ప్రయివేటు, బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగాలు, ఉత్పత్తిలో నాణ్యత ఎండ మావే అన్నారు. సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా బహుళ జాతి కంపెనీలు వ్యవహరించడం లేదనీ, ప్రకృతి సహజ వనరులను దోపిడీ చేస్తూ ధనార్జనే ధ్యేయంగా ఈ బహుళజాతి కంపెనీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నా యన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మత ఉన్మాదం హెచ్చుమీరిందనీ, ఈ విధానాలు దేశ సమగ్రతను దెబ్బ తీసేలా ఉన్నాయనీ, బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ కాషాయ భావజాల విధానా లు, పోకడలను ప్రజలపై రుద్దడానికి తీవ్ర దుష్ట ప్రయత్నా లు చేస్తున్నారనీ, ఈ చర్యలు శాస్త్రీయ దృక్పథం కలిగిన నేటి యువత మతతత్వ రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ హైదరా బాద్ జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ, రాష్ట్ర సమితి సభ్యులు మర్రి శ్రీమాన్, ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు చైతన్య యాదవ్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు రాజు, నర్సింహ, మజీద్ అలీఖాన్, మహమూద్, హుస్సేన్, తదిత రులు పాల్గొన్నారు.