Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ కలెక్టరేట్లో మౌలిక సాకర్యాలు కరువు
- స్లాబ్ కూలుతున్నా.. అలసత్వమెందుకు..
- పాత రంగారెడ్డి కలెక్టరేట్ భవనం సముదాయంలోకి మారేదేన్నడో..
- జనం అవస్థలు.. పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నాంపల్లి-అబిడ్స్ రోడ్డులోని భవనంలో హైదరాబాద్ కలెక్టరేట్ భవనం కొనసాగుతోంది. ఇక్కడున్న మూడు భవనాల్లో రెండు శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడూ కూలుతాయో తెలియని పరిస్థితి. మౌలిక సౌకర్యాలు లేవు. మరుగుదోడ్లు ఉన్నా.. నిర్వహణ పట్టించుకునే వారు కరువయ్యారు. ఫలితంగా కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు నానా ఇబ్బందులు తప్పడంలేదు. మరో భవనంలో కలెక్టర్, అదనపు కలెక్టర్, రెవెన్యూ విభాగాలు కొనసాగు తున్నాయి. గదులు ఇరుకుగా మారడంతో ఇబ్బం దులు పడుతున్నారు. ఇదిలావుంటే కలెక్టర్ ఛాంబర్ ఉండే అంతస్తులో ఎన్ఐసీ గది ఉంది. గతేడాది భారీ వర్షాల ధాటికి డీఐసీ అధికారి కూర్చునే గదిలోని స్లాబ్ ఒక్కసారిగా కూప్పకూలింది. ఆ అధికారికి తృటిలో ప్రమాదం తప్పింది. అది జరిగి కూడా సరిగ్గా ఏడాది కావస్తోన్న ఇప్పటికీ మరమ్మత్తు చేపట్టలేదు. ఇక శిథిల భవనాలకు చేరినా పైకప్పు నుంచి ఎప్పుడు ఏది ఊడి పడుతుందోనని ఉద్యోగులు భయపడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనులు చేస్తున్నామని చెబుతు న్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాత రంగారెడ్డి కలెక్టరేట్ భవనానికి సంబంధించిన మరమ్మతులు త్వరగా పూర్తిచేసి.. హైదరాబాద్ కలెక్టరేట్‌ను అక్కడి తరలించాలని వారు కోరుతున్నారు.
నగర శివారులోని కొంగరకలాన్‌లో నిర్మించిన సమీకృత భవన సముదాయంలోకి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ మారింది. ఈ భవనంలోకి వెళ్లికూడా దాదాపు ఎనిమిది నెలలు కావస్తోంది. ఇక అప్పటినుంచి లక్డీకాపూల్‌లోని భవనాలు ఖాళీగానే ఉన్నాయి. హైదరాబాద్ కలెక్టరేట్‌ను లక్డీకాపూల్‌కు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపించారు. ప్రభుత్వం సైతం గ్రీన్ సిగల్ ఇచ్చిందని సమాచారం. కానీ నిధులు మంజూరు చేయలేదు. ఫలితంగా తరలింపుపై స్పష్టత లేకుండా పోయింది.
నిధులు రాక..నిలిచిన మరమ్మతులు
ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కొనసాగిన లక్డీకాపూల్‌లోని స్ఫూర్తి భవన్‌కు మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇందుకు రూ.3 కోట్ల వరకు ఖర్చవు తుందని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు. ఆరు నెలల క్రితమే ఇందుకు సంబంధించిన నివేదికను సంబంధిత అధికారులు కలెక్టర్‌కు సమర్పించారు. నేటికి నిధులు విడుదల కాక.. మరమ్మతులకు నోచుకోక భవనాలు వృథాగా పడి ఉన్నాయి. నిధుల విడుదల కోరుతూ హైదరాబాద్ జిల్లా నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లినా.. ఇంకా విడుదల కాలేదని ఉద్యోగులు చెబుతున్నారు.
లక్డీకపూల్లో భవనాలు కటాయిస్తే ఒకే చోట అన్ని ఆఫీస్‌లు..
ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన కార్యాలయాలు వేర్వేరు చోట్ల ఉన్నాయి. నాంపల్లి కలెక్టరేట్లో రెవెన్యూ, మహిళ శిశు సంక్షేమం, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, ఇంజనీరింగ్ విభాగం, సర్వేయర్, ప్లానింగ్, యువజన, మైనార్టీ సంక్షేమం వంటి కొన్ని శాఖలే ఉన్నాయి. విద్యాశాఖ(డీఈవో ఆఫీస్), ఇంటర్ విద్య, వైద్యారోగ్య, రిజిస్ట్రేషన్ శాఖ, గిరిజన శాఖ, బీసీ సంక్షేమం, ఇతర సంక్షేమ శాఖలు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. చాలా శాఖలు కలెక్ట రేట్ భవనంలో లేకపోవడంతో అదితెలియక వచ్చేవారు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. కనీసం అడిగితే సమాధానం చెప్పేవారు కూడా ఉండరు. హెల్ప్‌డెస్క్ లేదు. దీంతో కలెక్టరేట్‌కు వివిధ పనుల కోసం వచ్చే అర్జీదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. లక్డీకాపూల్‌లోని భవనాలు కేటాయిస్తే అన్ని శాఖలు ఒకే చోట ఉండేందుకు వీలుంటుంది. దీనివల్ల అర్జీదారులకు తిరిగే తిప్పలు తప్పుతాయి.