Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఐదు మున్సిపల్ డివిజన్లలో జీహెచ్ఎంసీ చేపట్టిన కమ్యు నిటీ ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదే శించారు. స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రతి రోజూ ఎంపిక చేసిన కాలనీలు, బస్తీల్లో విధిగా అధికార యంత్రాంగం పర్యటించి వారి ద్వారా స్థానికుల సాధక బాధకలకు సంబంధించిన వివరాలను తమకు అందించాలని ఆయన బుధవారం ఓ ప్రకటనలో సూచించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సితాఫల్మండీ, బౌద్దనగర్ డివిజన్ల పరిధుల్లో 121 బస్తీలు, కాలనీల్లో జీహెచ్ఎంసీతోపాటు వివిధ విభాగాల అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కమ్యూనిటీ ఇంట రాక్షన్ కార్యక్రమాన్ని రూపొందించినట్టు అయన తెలిపారు. మల్టీ-డిసిప్లినరీ ఫీల్డ్ లెవల్ టీమ్ యాక్షన్ ప్లాన్లో భాగంగా స్థానిక కార్పొరేటర్లు కుడా అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారని తెలిపారు. తాము వివిధ సందర్భాల్లో సికింద్రాబాద్ పరిధిలోని దాదాపు అన్ని బస్తీలు, కాలనీల్లో విస్తతంగా పర్యటించి, స్థానికుల అవస రాలను తెలుసుకుని వివిధ సదుపాయాలని కల్పించేందు కు నిధులను కుడా మంజూరు చేసినట్టు పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. తాజాగా అధికార యంత్రాంగం నిర్వహిం చనున్న ఈ పర్యటనలు క్షేత్రస్థాయిలో ఫిర్యాదులను సమర్థ వంతంగా, సమయానుకూలంగా పరిష్కరించడానికి ఉపక రిస్తాయనీ, స్థానిక బస్తీ /కాలనీ సంఘాలతో సమన్వయం ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీతో పాటు జలమండలి, విద్యుత్, వైద్య, పోలీస్ విభాగాలను కూడా ఈ క్షేత్ర స్థాయి పర్యటనలలో భాగస్వామ్యం చేయనున్నట్టు పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.