Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
రాష్ట్ర తొలి హౌంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి జయంతి వేడుకల్లో భాగంగా నాయిని నర్సింహరెడ్డి మెమోరియల్ ట్రస్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన పార్సిగుట్ట సమీపంలోని అడిజ్మెట్ జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని ఇండోర్ స్టేడియంలో షటిల్ టోర్నమెంట్-2 పోటీలు నిర్వహించనున్నట్టు ట్రస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు వి.సమతారెడ్డి, వి.శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాయిని దేవేందర్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఇండోర్ స్టేడి యంలో ఏర్పాట్లను ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొ రేటర్ వి.శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ షటిల్ పోటీల్లో విజేతల్లో మొదటి బహుమతి రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.5 వేలు, మహిళా జట్లకు కూడా బహు మతులు అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమ బహుమతి ప్రదానోత్సవానికి నేషనల్ హుడబ్బాల్ అంబాసిడర్, మిస్ ఏషియా రక్ష్మి రాకూర్, బి గస్ ఫేం సన్ని, నేషనల్ వాలీబాల్ ప్లేయర్ శ్రీలత, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ ప్రియానవీన్ గౌడ్, టీఆర్ఎస్ గ్రేటర్ సీనియర్ నాయకుడు, ఎమ్మెన్ శ్రీనివాస్ రావు తదితరులు హాజరవుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ పోటీల్లో ఆసక్తి గల షటిల్ శ్రీకారులు తమ పేరు నమో దు కోసం 9705347212 ఫోన్ నెంబర్లను సంప్రదించా లనీ, ప్రవేశం ఉచితం అని వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయక రాజులు బిజ్జి వెంకటేశ్వరరావు, పున్నం ప్రవీణ్, కార్తీక్ యాదవ్, సిద్దిఖి, నాయిని పృద్వీరెడ్డి, పాండు, అంజి. సాయి తదితరులు పాల్గొన్నారు.