Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వారు ప్రపంచ చేతి పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం హాస్పిటల్ ఆవరణలో చేతి పరిశుభ్రతా దినోత్సవాన్ని ప్రధానంగా ''అందరూ కలసి ఆరోగ్య సేవలు అందించే సంస్థలలో కలసికట్టుగా పని చేసి అంటువ్యాధులు, యాంటీ మైక్రోబయల్ నిరోధకలను నివారించే ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా చేతి పరిశుభ్రత ఉద్యమాన్ని ప్రాధాన్యత క్రమంలో చేపట్టడమనే'' నినాదంతో నిర్వహించారు. కన్సల్టెంట్ మైక్రో బయాలజిస్టు డా.సఫా అహమ్మద్తో పాటు ఛీఫ్ ఇన్ఫెక్షన్ కంట్రోలింగ్ నర్సింగ్ ఆఫీసర్ సోనియా, నర్సింగ్ విభాగాధిపతి బి.రేవతి పాల్గొని సిబ్బందికి పలు అంటువ్యాధులు, దానివల్ల కలిగే నష్టాలు, శుభ్రపరచుకుంటే కలిగే లాభాల గురించి వారికి అవగాహన కల్పించారు.