Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో గణనీయంగా విద్యుత్ ఉత్పత్తి పెరిగిందనీ, రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పాలసీని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని డెరైక్టర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టీఎస్ ట్రాన్స్ కో జె.సూర్య ప్రకాష్ అన్నారు. శుక్రవారం ఓయూ ఎలక్ట్రికల్ ఇంజినీ రింగ్ విభాగం ఆధ్వర్యంలో టెక్స్లో నెన్స్ 2023 కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు. 2030 వరకు 100శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించటానికి ప్రత్యేక లక్ష్యంతో ముందుకు పోతున్నట్టు చెప్పారు. విభాగం విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వివిధ కళా శాలల ఇంజినీరింగ్ విద్యార్థులు సింపొజియంలో పాల్గొని పలు నమూనాలు ప్రదర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సౌర విద్యుత్ సహాయంతో ఎలా పని చేస్తుందో వివరించారు. వివిధ మోడల్స్ విద్యుత్ వాహనాలు ప్రదర్శన చేశారు. టెక్నీకల్ అండ్ నాన్ టెక్నీకల్ ఈవెంట్స్ నిర్వహించారు. బాసర ఐఐఐటీ డెరైక్టర్ ప్రొ.పి.సతీష్ కుమార్, యూజీసీ డీన్ ప్రొ.జి.మల్లేశం, ప్రిన్సిపాల్ ప్రొ.శ్రీరాం వెంకటేష్, హెడ్ ప్రొ.విద్యా సాగర్, ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్ ప్రొ. మంగు, ప్రొ.లోకెందర్రెడ్డి, స్టూడెంట్ కో-ఆర్డినేటర్ ఎం.వివేక్, అక్షయ, కులసం, నరేష్, సంజరు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.