Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
సినిమా ఆర్టిస్టులకు ఎప్పుడు, ఎలాంటి అవసరమైనా, ఆపదలో ఉన్న వారికి వెంటనే ఆర్థిక సహాయం అంది స్తున్న'' మనం సైతం కాదాంబరి ఫౌండేషన్'' అందులో భాగంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ కల్వకుంట్ల సంధ్యారాణికి ( యూనియన్ కార్డు నెంబర్ 296) తన ఫౌండేషన్ ద్వారా నిధులు సేకరించి రూ.25 వేల చెక్కును ఆమె తోటి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇందిరా ఫణి ద్వారా సంధ్యారాణికి పంపిం చారు. ఈ సందర్భంగా మనం సైతం ఫౌండేషన్ నిర్వాహ కులు కాదాంబరి కిరణ్ మాట్లాడుతూ సినిమా ఆర్టిస్టులు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, ప్రమాదాల్లో గాయ పడినా వెంటనే కాదాంబరి ఫౌం డేషన్ సభ్యులకు విషయం తెలి యపరచి, వారికి కావాల్సిన ఆర్థిక సహాయం సమకూర్చి అం దిస్తున్నామని చెప్పారు. కాదాం బరి ఫౌండేషన్ ముఖ్య సభ్యులు పి.సత్యనారాయణ, ఎం. విజ యభాస్కర్రెడ్డి ఆపదలో ఉన్న వారికి సాయం చేయటంలో ఎల్ల ప్పుడూ తనకు తోడుగా ఉంటు న్నారని కిరణ్ అన్నారు.