Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. శుక్రవారం పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇవ్వ టానికి వచ్చిన వారితో సీపీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. అనంతరం అక్కడ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న సిబ్బంది పని తీరును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. సివిల్ వివాదాల్లో పోలీ సులు పాల్గొనకూడదనీ, సివిల్ వివాదాల కేసులను కోర్టులో చూసుకోవాలని సూచించాలన్నారు. పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని ఆదేశించారు. మహిళలు, వృద్ధుల సమస్యలను త్వరగా పరిష్క రించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి స్థానిక శివారు ప్రాంతాల్లో నివాసాలుంటూ అక్రమాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా వేయాలన్నారు. నెలకోసారి పహడిషరీఫ్ పోలీస్ స్టేషన్, నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్, భువనగిరి స్టేషన్ తదితర ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటానని సీపీ అన్నారు. ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి తన దగ్గరకు రావటానికి దూరం అవు తున్నందు వల్ల తానే స్వయంగా వచ్చి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసు కుంటానని తెలిపారు. నిరంతరం నిఘా పెంచటం వల్ల చైన్ స్నాచింగ్లు తగ్గాయన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం మహేశ్వరం జోన్ అధికారులతో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.